యాక్షన్ హీరో గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటీమార్‌కు ఓ మోస్తరు టాక్, వసూళ్లు రాగానే.. ఈ సినిమా విడుదల గురించి సమాచారం బయటికి వచ్చింది. త్వరలో విడుదల అంటూ కొత్త పోస్టర్ వదిలారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అక్టోబరు 8న ఆరడుగుల బుల్లెట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఐతే ఏడెనిమిదేళ్ల కిందట మొదలైన ఈ సినిమాకు మేకింగ్ దశలోనే చాలా ఆలస్యం జరిగింది. రిలీజ్ విషయంలో మరింత ఆలస్యం తప్పలేదు. నాలుగేళ్ల కిందట సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి థియేటర్లు బుక్ చేసి విడుదలకు అంతా సిద్ధం చేశాక.. రిలీజ్ రోజు ఫైనాన్స్ సమస్యలు తలెత్తడం.. విడుదల అర్ధంతరంగా ఆగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారైనా సినిమా పక్కాగా విడుదలవుతుందా.. మళ్లీ చివరి నిమిషంలో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా అని చూడాలి. అక్టోబరు 8న వైష్ణవ్ తేజ్ సినిమా కొండపొలంతో ఆరడుగుల బుల్లెట్ పోటీ పడనుంది.
ముందు భూపతి రాజా అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను మొదలుపెట్టి.. మధ్యలో అతను తప్పుకుంటే సీనియర్ గోపాల్ చేతికి ఈ సినిమా వెళ్లింది. ఆయనే సినిమాను పూర్తి చేశారు.ఇందులో అగ్ర కథానాయిక నయనతార.. గోపీచంద్‌కు జోడీగా నటించింది. బాలాజి రియల్ మీడియా బేనర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ కావడం విశేషం.
This post was last modified on October 2, 2021 6:22 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…