హార్రర్ కామెడీ.. ఒకప్పుడు తెలుగులో కాసుల పంట పండించిన జానర్. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి, కాంఛన, రాజు గారి గది.. ఇలా ఈ జానర్లో వచ్చిన చాలా సినిమాలు ఘనవిజయాలందుకున్నాయి. కానీ ఈ జానర్లో ఒక దశ దాటాక మరీ రొటీన్ సినిమాలు రావడం.. జనాలకు మొహం మొత్తేయడంతో తిరస్కరణ మొదలైంది. హార్రర్ కామెడీ అంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి తలెత్తింది. వరుసగా ఈ జానర్లో వచ్చిన సినిమాలు నిరాశ పరచడంతో ఇక్కడ ఆ టైపు సినిమాలను పక్కన పెట్టేశారు.
కానీ తమిళంలో మాత్రం ఈ జానర్‌ను ఎంతకీ వదలట్లేదు. మన హార్రర్ కామెడీ సినిమాల స్ఫూర్తితో సీనియర్ దర్శకుడు సుందర్.. కొన్నేళ్ల కిందట హన్సిక ప్రధాన పాత్రలో ‘ఆరణ్మయి’ అనే సినిమా తీశాడు. అది అక్కడ సూపర్ హిట్టయింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కళావతి’ పేరుతో రిలీజ్ చేశారు. సరైన స్పందన రాలేదు. తర్వాత త్రిష, సిద్దార్థ్‌లతో ‘ఆరణ్మయి-2’ తీశాడు. అది కూడా అక్కడ బాగా ఆడింది.
కానీ తెలుగులో రిలీజ్ చేస్తే మనోళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు సుందర్ ఈ సిరీస్‌లో ‘ఆరణ్మయి-3’ తీశాడు. ఈ చిత్రం ఇంకా భారీ స్థాయిలో తెరకెక్కింది. ఇందులో ఆర్య హీరోగా నటిస్తే.. టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ రాశి ఖన్నా కథానాయికగా నటించడం విశేషం. ఆండ్రియా, సుందర్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు. అందులో ఒక్క సీన్, షాట్ కూడా కొత్తగా లేదు. మన ఫిలిం మేకర్లు అరగదీసిన కాన్సెప్ట్‌లనే మళ్లీ అక్కడ వాడినట్లున్నారు.
అనగనగా ఒక రాజమహల్.. అందులో తీరని కోరికతో ఓ దయ్యం.. అక్కడికి వెళ్లిన వాళ్లనంతా ఓ ఆటాడించడం.. ఆ దయ్యానికో ఫ్లాష్ బ్యాక్.. దయ్యాన్ని నియంత్రించడానికి ఓ మంత్రగాడు.. హీరో హీరోయిన్లు అతడితో కలిసి దయ్యం బెడద వదలించుకోవడానికి ప్లాన్ చేయడం.. ఇలా ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాలా కనిపిస్తోందిది. హార్రర్ కామెడీ సీన్లేవీ కొత్తగా లేవు. కొన్ని నెలల కిందట కరోనా కారణంగా చనిపోయిన కమెడియన్ వివేక్ నటించిన చివరి సినిమా ఇది. ఆయన నటించిన ఓ సన్నివేశం ట్రైలర్లోనూ ఉంది.
This post was last modified on October 2, 2021 12:08 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…