ఆ ఐదు కోట్ల సంగ‌తేంట‌న్న బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త సంచ‌ల‌నానికి తెర తీశారు. తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌తో సినీ ప‌రిశ్రమ సమావేశాల‌కు త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ భూములు పంచుకోవ‌డానికి వెళ్లారంటూ ఆయ‌న కొన్ని రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి స‌హా సినీ పెద్దల తీరును విమ‌ర్శిస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) బిల్డింగ్ కోసం అమెరికాలో చేసిన షో గురించి బాల‌య్య ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాడు. ఇప్పుడు రూ.5 కోట్ల విరాళాల ల‌క్ష్యంతో షో చేశారు క‌దా.. ఆ డ‌బ్బులేమ‌య్యాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించాడు.

‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవిగారు అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. కట్టారా ‘మా’ కోసం బిల్డింగ్. ఇవాళ‌ గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం ట్యాక్సులు.. డబ్బు. ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే. ఇంత వరకు ‘మా’ బిల్డింగ్ కట్టలేదు. మద్రాస్‌లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా అనే ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? అందుకే నేను ఇలాంటి విష‌యాల్లో ఏం కలుగజేసుకోను. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి’’ అంటూ బాల‌య్య కౌంట‌ర్లు వేశాడు.