అఖిల్, హాయ్ చిత్రాల్లో మంచి లవర్‌గా కనిపించిన అఖిల్.. ‘మిస్టర్ మజ్ను’లో కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చాడు. అయితే నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో మాత్రం ఫుల్ రొమాంటిక్‌గా కనిపించబోతున్నాడని రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటాడు అఖిల్. పెళ్లిచూపులకు వెళ్లిన ప్రతిచోటా మనోడిని చూసి అమ్మాయిలు ఖంగు తింటూ ఉంటారు. వైల్డ్‌గా ఆలోచించమని చెప్పడంతో ఓ అమ్మాయి అయితే ఏకంగా కోర్టుకే వెళ్తుంది. అలాంటివాడి లైఫ్‌లోకి పూజా హెగ్డే ఎంటరవుతుంది. ఈమెకి కూడా పెళ్లి, కాపురం వంటి విషయాల్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం తొమ్మిది వేల రాత్రులు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి, కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి అనే కాన్సెప్ట్ ఆమెది. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది కథ.
కూల్‌గా కనిపిస్తూనే డిఫరెంట్‌గా ఆలోచించే కుర్రాడిగా అఖిల్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు బొమ్మరిల్లు భాస్కర్. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయేలా సీన్స్ ప్లాన్ చేశాడు. మధ్యలో ఫరియా అబ్దుల్లా, ఈషా రెబ్బా లాంటి బ్యూటీస్‌ని కూడా గెస్టులుగా తీసుకొచ్చి గ్లామర్‌ని యాడ్ చేశాడు. ఎమోషన్స్‌ని కూడా బాగా మిక్స్ చేశాడనిపిస్తోంది. ‘ఒక హోప్ పట్టుకుని ఒకప్పుడు నేను కూడా చీకటి నుంచి వెలుతురికి వచ్చాను.. లోకం సర్దుకుపో అంటోంది.. మందని వదిలి కొత్తదారి వెతికి నేను వెళ్తున్నాను’ వంటి డైలాగ్స్‌ని బట్టి ఏదో డెప్త్ ఉన్న కాన్సెప్టే అనిపిస్తోంది. అఖిల్ ఖాతాలో ఓ మంచి హిట్ పడే చాన్స్ ఉందనే అభిప్రాయాన్ని ట్రైలర్ కలిగించింది.
This post was last modified on October 1, 2021 10:04 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…