కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ఇటు తెలుగు సినీ పరిశ్రమ, అటు మన ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన సినిమా అంటే లవ్ స్టోరినే. రకరకాల కారణాల వల్ల ఈ సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో కనిపించాయి. వేసవిలో వకీల్ సాబ్ తర్వాత థియేటర్లను ఆ స్థాయిలో కళకళలాడించిన చిత్రం ఇదే.
సినిమాకు కొంచెం డివైడ్ టాక్ వచ్చినా సరే.. ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా అదరగొట్టింది. తొలి మూడు రోజులూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది. తొలి వారాంతంలోనే లవ్ స్టోరి రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. యుఎస్‌లో అయితే ఈ చిత్రం ప్రిమియర్లతో కలిపి వీకెండ్లోనే మిలియన్ మార్కును దాటేసింది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే బయ్యర్లకు లాభాల పంటే అనుకున్నారు. కానీ వీకెండ్ తర్వాత లవ్ స్టోరి ఊపు కొనసాగలేదు.
డివైడ్ టాక్‌కు తోడు వాతావరణ పరిస్థితులు లవ్ స్టోరి జోరుకు బ్రేకులేశాయి. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తడంతో జనాలు థియేటర్లకు రావడం మానేశారు. గులాబ్ తుఫాన్ ప్రభావం ఊహించినదానికంటే ఎక్కువ ఉండటంతో చాలా చోట్ల షోలే నడిపించలేని పరిస్థితి తలెత్తుతుంది. లవ్ స్టోరి చాలా బాగా ఆడుతున్న హైదరాబాద్‌లో సోమవారం వర్షంతో అతలాకుతలం అయింది. మిగతా చోట్లా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.
దీనికి తోడు బంద్ ప్రభావం కూడా ఉండటంతో సోమవారం లవ్ స్టోరికి నామమాత్రమైన వసూళ్లు వచ్చాయి. మంగళవారం వర్షం ప్రభావం తగ్గినా.. ముందస్తు హెచ్చరికల కారణంగా జనాలు బయటికి రావడం తగ్గించేశారు. దీంతో వరుసగా రెండో రోజూ లవ్ స్టోరికి పరిస్థితులు కలిసి రాలేదు.
ఈ రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల షేర్ వివరాలు వెల్లడి కాలేదు కానీ.. చాలా తక్కువ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. చూస్తుంటే వీక్ డేస్‌లో లవ్ స్టోరి ఇక పెద్దగా పుంజుకునే అవకాశాలు లేనట్లే ఉంది. ఈ వీకెండ్లో రిపబ్లిక్ టాక్‌ను బట్టి లవ్ స్టోరికి ఎలాంటి వసూళ్లు వస్తాయన్నది ఆధారపడి ఉంది.
This post was last modified on September 28, 2021 8:30 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…