‘బాహుబలి’ రెండు పార్ట్‌ల కోసం ఐదేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు రాజమౌళి. దీని తర్వాత ఆయన లైన్లో పెట్టిన ‘ఆర్ఆర్ఆర్’ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికలతోనే రంగంలోకి దిగాడు కానీ.. మామూలుగానే రాజమౌళి చేసే ఆలస్యానికి తోడు కరోనా మహమ్మారి ఆయన ప్లాన్లను దెబ్బ తీసింది. ఏడాది కిందటే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఇంకో ఆరు నెలల తర్వాత కూడా విడుదలయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే మూడుసార్లు ఈ చిత్రం రిలీజ్ డేట్ మార్చుకున్న సంగతి తెలిసిందే.
అక్టోబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయట్లేదని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కొత్త డేట్ ఏదన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఉత్తరాది మార్కెట్ పూర్తి స్థాయిలో ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూసుకుని కొత్త డేట్ ప్రకటించాలని అనుకున్నారు. మహారాష్ట్రలో వచ్చే నెలలోనే థియేటర్లు పున:ప్రారంభం కానున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో బాలీవుడ్ నిర్మాతలు ఒకరితో ఒకరు పోటీ పడి రిలీజ్ డేట్లు ప్రకటించారు. ఆలస్యమైతే సరైన డేట్ దొరకదన్న ఆత్రుతతో ఎవరికి తోచినట్లు వాళ్లు డేట్ ప్రకటించేశారు. రెండు రోజుల వ్యవధిలో 20కి పైగా సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించడం విశేషం. దీంతో దీపావళితో మొదలు పెడితే వచ్చే వేసవి వరకు అన్ని ముఖ్యమైన వారాలకు బెర్తులు ఫుల్ అయిపోయాయి. ఈ పరిణామం ‘ఆర్ఆర్ఆర్’కు ఇబ్బందిగా మారింది.
ఇటీవల ప్రచారం జరుగుతున్నట్లు జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకుంటే ముందు వారాల్లో 83, ‘జెర్సీ’ లాంటి క్రేజీ చిత్రాలు.. తర్వాతి వారం తెలుగులో మూడు భారీ చిత్రాలు బరిలో ఉన్నాయి. వేసవికి వెళ్దామంటే దాదాపుగా ప్రతి వారానికీ బెర్తులు బుక్ అయిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రానికి వేసవి రిలీజే కరెక్ట్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ.. మార్చి చివరి వారంతో మొదలుపెడితే షంషేరా, భూల్ భూలయియా-2, కేజీఎఫ్-2, మే డే, హీరో పంటి-2 లాంటి చిత్రాలు వరుసగా షెడ్యూల్ అయిపోయాయి. వీటి మధ్య ‘ఆర్ఆర్ఆర్’ను ఎక్కడ దించాలో అర్థం కాని పరిస్థితి.
వాటికి పోటీగా ఈ సినిమాను ఏదైనా వారానికి షెడ్యూల్ చేస్తే.. దసరాకు ‘మైదాన్’కు పోటీగా ‘ఆర్ఆర్ఆర్’ను నిలబెట్టినందుకు బోనీ కపూర్ విమర్శించినట్లు విమర్శిస్తారు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’కు సరైన డేట్ ఎంచుకోవడం రాజమౌళికి తలనొప్పిగా మారేట్లే కనిపిస్తోంది.
This post was last modified on September 27, 2021 2:07 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…