కొంచెం డివైడ్ టాక్ ఉంటేనేమి.. బాక్సాఫీస్ దగ్గర లవ్ స్టోరి జోరు మామూలుగా లేదు. తొలి రోజు లాగే రెండో రోజూ ఈ సినిమా భారీ వసూళ్లే రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి శనివారం కూడా మెజారిటీ థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ముఖ్యంగా నైజాంలో లవ్ స్టోరి జోరు మామూలుగా లేదు. తొలి రోజు తెలంగాణలో రూ.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్లగొట్టింది. మొత్తం ఈ ఏరియాలో 2 రోజుల షేర్ రూ.5.6 కోట్లకు చేరింది.
ఆదివారం కూడా సినిమాకు ఇదే స్థాయిలో వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో నైజాంలో రూ.10 కోట్ల షేర్ మార్కును పెద్ద కష్టం కాకపోవచ్చు. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉన్నప్పటికీ ఈ చిత్రం బాగానే పెర్ఫామ్ చేస్తోంది. రెండో రోజు అక్కడ రూ.2.5 కోట్ల మేర షేర్ వచ్చినట్లు అంచనా. అక్కడ మొత్తం రెండు రోజుల షేర్ రూ.6 కోట్లకు అటు ఇటుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు కలిపి లవ్ స్టోరి షేర్ రూ.12 కోట్లకు చేరువగా ఉంది. యుఎస్‌లో ఈ సినిమా ఇంకా మెరుగైన వసూళ్లు రాబడుతోంది.
కరోనా ధాటికి పూర్తిగా చల్లబడిపోయిన యుఎస్ తెలుగు సినిమా బాక్సాఫీస్‌లో లవ్ స్టోరి వేడి పుట్టించింది. ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే 6 లక్షల డాలర్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. శనివారం కూడా అదరగొట్టింది. 2.88 లక్షల డాలర్లు రాబట్టి ఔరా అనిపించింది. దీంతో మొత్తం యుఎస్ వసూళ్లు 8.95 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. ఆదివారమే లవ్ స్టోరి మిలియన్ డాలర్ల క్లబ్‌లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం మొదలయ్యాక యుఎస్‌లో రిలీజైన తెలుగు సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా లవ్ స్టోరి నిలవడం లాంఛనమే.
This post was last modified on September 27, 2021 7:28 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…