ఎంతో టాలెంట్ ఉన్నా దానికి తగ్గ అవకాశాలు రాక చాలా కాలం మరుగున ఉండిపోయాడు నవీన్ పొలిశెట్టి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలేసుకుంటూ నెట్టుకొచ్చాడతను. ఐతే మధ్యలో హిందీలో షార్ట్ ఫిలింలు, స్పెషల్ వీడియోలు అవీ చేసి అక్కడ బాగానే పాపులారిటీ సంపాదించాడు.
తర్వాత తెలుగులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి విభిన్నమైన సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన అతను.. అదిరిపోయే పెర్ఫామెన్స్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. సినిమా కూడా బాగుండటంతో మంచి ఫలితాన్నందుకుంది. దీంతో ఒక్కసారిగా నవీన్‌పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇదే సమయంలో హిందీలో ‘చిచ్చోరే’తో సత్తా చాటాడు. దీంతో తెలుగులో అతడి కొత్త సినిమా ‘జాతి రత్నాలు’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా లేకుంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజయ్యేుది కూడా.
లాక్ డౌన్ వల్ల రెండు నెలలకు పైగా ఇంటి పట్టునే ఉంటున్న నవీన్.. ఈ టైంలో కూడా ఖాళీగా లేకుండా కొన్ని వీడియోలు చేస్తున్నాడు. హిందీ ఫాలోవర్ల కోసం ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోక మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగు వారి కోసం ఒక వీడియో చేశాడు. ఇది చూస్తే నవీన్ ఎంత మంచి పెర్ఫామర్ అనే విషయం మరోసారి అర్థమవుతుంది.
కరోనా రాకముందు, వచ్చిన తొలి రోజుల్లో, ఆ తర్వాత తన అనుభవాల నేపథ్యంలో నవీన్ ఈ వీడియో చేశాడు. ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఈ వీడియో మొత్తం సాగింది. కరోనా రావడానికి ముందు 2020 మీద భారీ అంచనాలతో ఏడాదిని మొదలుపెట్టడం.. ‘జాతి రత్నాలు’ సినిమా గురించి బిల్డప్‌లు ఇవ్వడం చూపించి.. ఆ తర్వాత కరోనా గురించి చాలా తేలిగ్గా మాట్లాడటం.. ఆపై దాని ధాటికి కుదేలవడం.. ఇప్పుడు వాస్తవం బోధపడి అంచనాలన్నీ తగ్గించుకుని నేల మీదికి రావడం.. ఈ నేపథ్యంలో వీడియో నడిచింది. కేవలం ఫోన్ సంభాషణతోనే ఐదు నిమిషాలకు పైగా ఏమాత్రం బోర్ కొట్టించకుండా వీడియోను నడిపించాడు నవీన్.
This post was last modified on June 1, 2020 2:04 pm
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును…
ఏపీ సీఎం చంద్రబాబు విషయం గురించి చెబుతూ… మంత్రి నారాయణ ఒక మాట చెప్పారు. "మనం వచ్చే రెండు మూడేళ్ల…
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…