కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ హ్యూజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఆ ఆశను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. పోస్టర్లు, టీజర్లు చూస్తే ఆ చాన్స్ ఉందనే నమ్మకం కూడా కలిగింది. కానీ కరోనా వల్ల మూవీ థియేటర్‌కి రావడం మాత్రం కాస్త లేటయ్యింది.
ఎట్టకేలకి థియేటర్లు తెరుచుకోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేసేస్తామని ఆ మధ్య అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. బ్యాచ్‌లర్ దసరా బరిలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్‌ని చేంజ్ చేశామని, అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నామని నిన్న ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి పండగ సందర్భంగా రిలీజైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.
అఖిల్, పూజ ఫ్లైట్‌లో ఉన్న రొమాంటిక్ ఫొటోని కూడా వదిలారు. నిజానికి అక్టోబర్ 8న ఈ చిత్రంతో పాటు వైష్ణవ్ తేజ్, క్రిష్‌ల ‘కొండపొలం’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాని వాయిదా వేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే రీసెంట్‌గా చేసిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ ద్వారా తమ రిలీజ్ డేట్ చేంజ్ కాలేదని చెప్పకనే చెప్పింది ‘కొండపొలం’ టీమ్. కానీ ఊహించని విధంగా అఖిల్ సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. అయితే ఆ డేట్‌కి నాగశౌర్య ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశాడు.
లక్ష్మీ సౌజన్య డైరెక్షన్‌లో తను నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 15నే రిలీజవుతోంది. పైగా ముందు రోజు శర్వానంద్ ‘మహాసముద్రం’ కూడా వస్తుంది. అంటే ప్లాన్ మారినా అఖిల్‌కి పోటీ తప్పడం లేదన్నమాట.
This post was last modified on September 26, 2021 1:09 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…