‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఈ సినిమాతో శరత్ అనే కొత్త దర్శకుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు ముందు రవితేజ.. త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది.
ఇద్దరి మధ్య కథా చర్చలు జరగడంతో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని అన్నారు. కానీ కొన్నిరోజుల తరువాత రవితేజకి కథ నచ్చలేదని.. ఈ సినిమా ఆగిపోయిందని అన్నారు. రవితేజ నో చెప్పడంతో మెగాహీరో వరుణ్ తేజ్ కి ఇదే కథ చెప్పి ఓకే చేయించుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని దర్శకుడు త్రినాధరావు క్లారిటీ ఇచ్చారు. ఎన్నో సిట్టింగ్స్ తరువాత రవితేజ ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.
సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే రెడీ అయిందని.. కుదిరితే అక్టోబర్ మొదటివారం నుంచే సెట్స్ పైకి వచ్చేస్తామని అంటున్నారు. చాలా కాలంగా ఇదే కథపై రైటర్ ప్రసన్న కుమార్ తో కలిసి పని చేస్తున్నానని అన్నారు. ఇప్పుడు ఇదే కథతో రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నట్లు స్పష్టంచేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ బ్యూటీ ‘పెళ్లి సందD’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ కుర్ర హీరోయిన్ రవితేజ పక్కన ఎలా సూట్ అవుతుందో చూడాలి!
This post was last modified on September 21, 2021 1:30 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…