Movie News

ఎందుకంటే నేను ANR ఫ్యాన్ ని…

ఇది కుళ్ళిన సంఘం..వయసు మళ్ళిన సంఘం..దీని కీళ్లు విరిచివేయాలి..వేళ్ళు నరికి వేయాలి..సినిమా హిట్ కాలేదు కానీ నేను నాలుగు సార్లు చూసాను..ఎందుకంటె నేను ANR ఫ్యాన్ ని..సినిమా పేరు రంగేళి రాజా..ANR సీనిమాలలో కొన్ని అందరికి నచ్చకపోయినా నాకు నచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి..ఎందుకంటే నేను ANR ఫ్యాన్ ని…

ప్రేమనగర్ చూద్దామని గుంటూరు వెళ్లి ఉదయం ఆట టిక్కెట్టు దొరక్కపోతే తెనాలి వెళ్లి మ్యాటినీ కి ట్రై చేస్తే అక్కడా టిక్కెట్టు దొరకలేదు.. మరల గుంటూరు ఫస్ట్ షో కి కూడా దొరకకపోతే కడుపు మండి బ్లాక్ లో సెంకండ్ షో టిక్కెట్ కొనుక్కుని సినిమా చూసి(ఈ బ్లాక్ లో కొనడం ఏదైతే ఉందొ అది పొద్దున్నే చెయ్యొచ్చుగా అని మీకనిపించవచ్చు కానీ నాకు వెలగలా)..రాత్రి 2 గంటలకు నడిచి మా ఊరు (నాలుగు మైళ్ళు) వెళితే..ఇంటిదగ్గర పిచ్చ కొట్టుడు…అదీ పరిస్థితి..తర్వాత రోజుల్లో మా ఊరికి రెండుమైళ్ళు దూరంలో వున్న పెదకాకానిలో భ్రమరాంబ మల్లేశ్వర టాకీస్ అనే థియేటర్ కట్టారు.. భక్త ప్రహ్లాద సినిమాతో ఆ థియేటర్ ప్రారంబోత్సవం చేశారు.. వారానికి ఒక పాత సినిమా వేసేవారు.. వచ్చిన సినిమాలు అన్నీ చూసేవాల్లం నైట్ క్లాస్ లు అనే నెపం తో.. డొంకరోడ్డులో గుండా నడవాలి.. వర్షం పడ్డా లెక్కచేసేవాళ్ళం కాదు..

అసలు తెలుగు సినిమా కి రెండు పెద్ద దిక్కులుగా ఎన్టీఆర్.. ఏ ఎన్ ఆర్ లు ఉండేవారు.. ఇద్దరికీ విపరీతమైన పోటీ ఉండేది.. కానీ అది వారి సినిమాల మధ్య మాత్రమే పోటీ.. ఆంద్ర రాష్ట్రం లో ఏ విధమైన విపత్తు వచ్చినా తమవంతు సాయంగా విరాళాలు పోగుచేసి ఇచ్చేవారు.. తమ పారితోషకం పెంచాలన్నాగానీ రెండేళ్ళకొకసారి మాత్రమే పెంచేవారు..

గత రెండేళ్లు రిలీజయిన సినిమాలలో ప్లాపులు సూపర్ హిట్ లు తీసేసి మిగతా సినిమాల సగటు కలక్షన్స్ లో ఇంత శాతం పెంచొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చి తరువాత రోజు ఇద్దరూ తమతమ నిర్మాతల్ని పిలిచి ఈ విషయం మీద వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు పారితోషకం పెంచేవారు..

అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి తరలింపబడటానికి ఈ ఇద్దరి చొరవ ఎక్కువ.. అక్కినేని తన షూటింగ్ లు అన్నీ సారధీ స్టూడియోలోనే జరగాలని కండీషన్ పెట్టారు.. ఎన్టీఆర్ నాచారం లో ఒక స్టూడియో కట్టారు..ఇద్దరి గురించి చెప్పాలంటే ఒకాయన సాంఘీక చిత్రాలు.. ఇంకోఆయన పౌరాణికాలు జానపదాలలో శభాష్ అనిపించుకున్నారు.. ఎన్టీఆర్ తో పోలిస్తే ఏ ఎన్ ఆర్ పర్సనాలిటీ కానీ ఖంఠం గానీ కొంచం తక్కువ అనే చెప్పాలి.. కానీ ఎన్టీఆర్ ని ఎదుర్కొనడం కోసం అక్కినేని చాలా జాగ్రత్తలు తీసుకునేవారు.. తన కళ్ళు లైట్స్ వేసినా కూడా బ్రైట్ గా కనబడాలని గంటలకొద్దీ ఎండలో నిలబడి సూర్యుడి కేసి చుస్తూఉండేవారు.. ఆలా తనను తాను మౌల్డ్ చేసుకుని ఎన్టీఆర్ తో పోటీగా నిలబడగలిగారు..

నేను అసిస్టెంట్ డైరక్టర్ గా చేస్తున్న రోజుల్లో అక్కినేని సినిమాకి పనిచేసే అవకాశం కలిగింది.. అటువంటి అక్కినేని గారి సినిమా కి పని చెస్తూ ఉన్నప్పుడు కూడా(రావు గారిల్లు) నేను మీ అభిమానిని అని చెప్పలేదు… ఎందుకంటే అక్కినేని అంటే అభిమానమే… కానీ నాకు ఆత్మాభిమానం కూడా మెండు.. తర్వాత అక్కినేని వారి మూడో తరం హీరో అఖిల్ తో సినిమా చెయ్యడం ..అది చరిత్రలో నిలిచిపోయే సిసింద్రీ కావడం.. దాని ప్రారంభానికి అక్కినేని కుటుంబం మొత్తం రావడం..ఇదంతా ఒక అదృష్టం లా భావిస్తాను..నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని స్మరించుకుంటూ ఆయన జయంతి (సెప్టెంబర్ 20) రోజున నమస్సులు…

— శివ నాగేశ్వర రావు

This post was last modified on September 20, 2021 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

28 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago