‘స్కామ్ 1992’తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతీక్ నటిస్తోన్న కొత్త సినిమా ‘భవాయి’. దీన్ని అక్టోబర్ 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ సినిమాకి ‘రావణ్ లీలా’ అనే టైటిల్ పెట్టారు. అది వివాదాస్పదం కావడంతో ‘భవాయి’గా మార్చేశారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు.
రీసెంట్ గానే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. అందులో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ‘భవాయి’ అనేది గుజరాతీ జానపద నాటక కళ. ఈ కాన్సెప్ట్ తోనే దర్శకుడు ‘భవాయి’ అనే లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ చూపించే క్రమంలో.. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన ప్రతీక్ ను అరెస్ట్ చేసి.. సినిమాను నిషేధించాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప సినిమాలు వస్తుంటే.. బాలీవుడ్ లో మాత్రం ఇంకా మత సెంటిమెంట్ ను దెబ్బతీసేలా సినిమాలు వస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ వివాదంపై మొన్నామధ్య ప్రతీక్ స్పందించారు. రావణ పాత్రను హైలైట్ చేసేదిగా ఈ సినిమాలో ఏం ఉండదని.. ఒకట్రెండు సన్నివేశాలు చూసి ఓ అంచనాకు రావడం కరెక్ట్ కాదని అన్నారు.
This post was last modified on September 20, 2021 11:40 am
కరోనా దెబ్బకు ఆల్రెడీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏవైనా పెద్ద, ఈవెంట్ సినిమాలు రిలీజైనపుడే థియేటర్లు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…