ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఆమిర్ ఖాన్ ఒకడు. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ సినిమాలతో ఎప్పటికప్పుడు భారతీయ సినిమా రికార్డులను అతను బద్దలు కొడుతూ వచ్చాడు. కంటెంట్ పరంగా, కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా ప్రమాణాలను అమాంతం పెంచిన సూపర్ స్టార్ అతను. బాహుబలితో బాగా కలిసొచ్చి ప్రభాస్ అందరినీ మించిన స్టార్ అయిపోయాడు కానీ.. లేదంటే ఇండియాలో నంబర్ వన్ హీరో ఆమిర్ ఖానే.
ఐతే తాను అంత పెద్ద స్టార్ అనే అహంభావం ఆమిర్‌లో ఎప్పుడూ కనిపించదు. చాలా అణకువతో కనిపిస్తాడు. హుందాగా వ్యవహరిస్తాడు. ఎన్నడూ లేని విధంగా ఓ తెలుగు సినిమా ఈవెంట్ కోసం ఆమిర్ హైదరాబాద్‌కు విచ్చేసి ఇక్కడా తన హుందాతనాన్ని చాటుకున్నాడు. తన కొత్త మిత్రుడు అక్కినేని నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవిని ఆమిర్ గౌరవించిన తీరు ప్రశంసలందుకుంది.
ఈ ఈవెంట్ వేదిక మీద చివర్లో ఆమిర్ కొన్ని ఫొటోలు దిగాడు. బాలీవుడ్ సూపర్ స్టార్, పైగా ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చిన నేపథ్యంలో ఒక వైపు నాగచైతన్య, ఇంకో వైపు చిరంజీవి నిలబడి.. మధ్యలో ఆమిర్‌ను నిల్చోబెట్టి ఫొటో దిగబోయారు.
ఐతే ఒక్క క్షణం ఆగిన ఆమిర్.. తన ఎడమ వైపున్న చిరంజీవిని మధ్యలోకి తీసుకొచ్చి తను ఆయన స్థానంలోకి వెళ్లాడు. చిరంజీవి తన కన్నా సీనియర్. ఇండియన్ సినిమా లెజెండ్స్‌లో ఒకడిగా పేరున్నవాడు. అలాంటి నటుడిని పక్కన ఉంచి తాను మధ్య స్థానాన్ని తీసుకోవడం సమంజసం కాదని వెంటనే స్పందించి తన స్థానం మార్చుకుని చిరును సముచిత రీతిలో గౌరవించిన తీరు అందరినీ మెప్పించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ ఆమిర్ హుందాతనాన్ని పొగిడేస్తున్నారు చిరు ఫ్యాన్స్. అంతే కాక చిరు అంటే ఏంటో చెప్పడానికి ఈ వీడియోనే రుజువు అంటూ దాన్ని ఆనందంగా షేర్ చేస్తున్నారు.
This post was last modified on September 20, 2021 7:25 am
వైసీపీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…
భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…
పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…