ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను సరికొత్త కంటెంట్ తో అలరించడానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీల హవా నడుస్తుండంతో.. ఇప్పుడు ప్రాంతీయ భాషలపై కూడా ఫోకస్ పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ క్రమంలోనే తెలుగు కంటెంట్ పై దృష్టి పెట్టింది హాట్ స్టార్. తెలుగులో మరింత క్రేజ్ తెచ్చుకోవడానికి మెగాపవర్ రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.
తెలుగు రీజియన్ కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో రామ్ చరణ్ పాల్గొనున్నారు. దీనికి గాను రామ్ చరణ్ కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ ఎండోర్స్మెంట్ కి సంబంధించి రామ్ చరణ్ కు రూ.4 నుంచి రూ.5 కోట్ల రేంజ్ లో చెల్లిస్తున్నారట. ఒక తెలుగు స్టార్ కి ఈ రేంజ్ లో చెల్లించడమనేది విశేషమనే చెప్పాలి. చరణ్ కి ఉన్న క్రేజ్ తో హాట్ స్టార్ పాపులారిటీ పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటి తరువాత శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. దానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో చరణ్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారట. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా దీన్నితెరకెక్కించనున్నారు.
This post was last modified on September 19, 2021 9:50 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…