శుక్రవారం థియేటర్లలోకి గల్లీ రౌడీ సినిమా దిగింది. కానీ దాని కంటే కూడా వచ్చే వారం రాబోతున్న లవ్ స్టోరి సినిమాకు కనిపిస్తున్న బజ్ ఎక్కువగా ఉంది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ యాప్స్‌లో ఈ సినిమా దూకుడు చూసి అందరూ షాకైపోతున్నారు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రేంజిలో దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
విడుదలకు పది రోజుల ముందే లవ్ స్టోరికి బుకింగ్స్ మొదలు కావడం విశేషం. ముందుగా ఈ చిత్ర నిర్మాతలకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా టికెట్లు పెట్టడం ఆలస్యం అలా అమ్ముడైపోయి షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. తర్వాత హైదరాబాద్‌లో ఒక్కొక్కటిగా థియేటర్లు లవ్ స్టోరి టికెట్లను తెరిచాయి. రెస్పాన్స్ అదిరిపోయింది.
లవ్ స్టోరికి అతి పెద్ద ఆకర్షణ శేఖర్ కమ్ములనే అనడంలో సందేహం లేదు. చివరగా అతను తీసిన ఫిదా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో తెలిసిందే. మరోసారి ఇంకో స్వచ్ఛమైన ప్రేమకథతో శేఖర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా ప్రతి ప్రోమో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.
నాగచైతన్య, సాయిపల్లవి జోడీ కూడా సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత క్రేజున్న సినిమాలు రిలీజ్ కాక ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అనాసక్తితో ఉన్నారు. మళ్లీ బిగ్ స్క్రీన్లకు రావడానికి సరైన సినిమా కోసం చూస్తున్నారు.
అలాంటి సినిమానే లవ్ స్టోరి కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే మీడియం రేంజ్ సినిమాల్లో ఇది వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదు చేసేలా ఉంది.
This post was last modified on September 18, 2021 12:00 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…