లాక్ డౌన్ లో ఓటీటీ బిజినెస్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చేశాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ఓటీటీ కోసం సినిమాలు చేయాలనుకుంటున్నారు. వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఇప్పుడు ఓటీటీ ఛానెల్స్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారట.
వీటి కోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి ఓ గ్రూప్ ను తయారుచేశారు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల గైడెన్స్ లో కొంతమంది దర్శకులు ఓటీటీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ సంస్థల నుంచి అనుమతులు వచ్చిన తరువాత స్వయంగా కొరటాల శివ సినిమాపై పెట్టుబడులు పెట్టి.. సదరు దర్శకులతో సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాను దసరా కానుకహా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు కొరటాల శివ. ఈ సినిమా కోసం కథను సిద్ధం చేస్తూనే మరోపక్క ఓటీటీల కోసం కథలను రెడీ చేస్తున్నారు. మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
This post was last modified on September 18, 2021 8:49 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…