మంచి క్రేజున్న సినిమాలు రిలీజైనపుడు తొలి వారం అదనపు షోలు వేయడం, టికెట్ల రేట్లు పెంచుకోవడం ఒకప్పుడు చాలా మామూలు విషయమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఈజీగా ఇందుకు అనుమతులు వచ్చేసేవి. కానీ గత ఏడాదిన్నరలో పరిస్థితులు చాలా మారిపోయాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని థియేటర్లు నడవడం.. పేరున్న సినిమాలు రిలీజవడమే తగ్గిపోయింది.
థియేటర్ల పున:ప్రారంభం తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడమూ తగ్గించారు. గత నెలన్నర వ్యవధిలో బోలెడన్ని సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి కానీ.. దేనికీ ఆశించిన స్పందన రాలేదు. ఎట్టకేలకు ‘లవ్ స్టోరి’ లాంటి భారీ అంచనాలున్న సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో బుకింగ్స్ తెచ్చిన థియేటర్లలో జోరుగా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది ఇండస్ట్రీకి ఉత్సాహాన్నిస్తున్న విషయమే.
ఐతే ‘లవ్ స్టోరి’ పట్ల ప్రేక్షకుల స్పందన చూసేసరికి నిర్మాతల్లో టికెట్ల రేట్ల పెంపు ఆశలు పుట్టినట్లు సమాచారం. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించుకోవడం కూడా జరిగిందట. మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 రేట్లతో తొలి వారం టికెట్లు అమ్మాలని చూస్తున్నారట. ఈ సినిమా నిర్మాత అయిన ఏషియన్ సునీల్ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండటంతో అటు నుంచి సానుకూలంగానే స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఐతే కరోనా దెబ్బకు ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తగ్గించేసిన సమయంలో లేక లేక ఓ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తుంటే ఇలా రేట్లు పెంచి వారిని నిరుత్సాహపరచడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. ఓపక్క ఏపీలో ఉన్న రేట్లే తగ్గించేసి థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పాత రేట్లతో టికెట్లు అమ్ముకుంటే చాలని చూస్తున్నారు. అలాంటిది తెలంగాణలో ఉన్న రేట్లను పెంచి అమ్మితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.
This post was last modified on September 17, 2021 3:48 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…