తమన్నా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ తారగానే గుర్తింపు పొందింది. కొన్ని పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినప్పటికీ.. గ్లామర్‌తోనే ఆమె ఎక్కువగా ఆకట్టుకుంది. ఐతే అవసరమైతే పాటల్లో అందాలు ఆరబోయడం కామనే కానీ.. సినిమా అంతటా, కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ గ్లామర్ విందు చేయడం మాత్రం ఇంత వరకు జరగలేదు.
‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ ఇలాగే కనిపించి ఆశ్చర్యపరిచింది. స్క్రీన్లోకి అడుగు పెట్టి తొలి సన్నివేశం నుంచి చివరి వరకు తమన్నా అందాలు ఓ రేంజిలో ఆరబోసిందీ సినిమాలో. చాలా సీన్లలో క్లీవేజ్ షోలతో ప్రేక్షకుల మతులు పోగొట్టేసింది. హిందీలో టబు చేసిన పాత్రను తమన్నా ఇక్కడ చేయడం విశేషం. ఒరిజినల్లో ఆ పాత్రలో గ్లామర్ కోణమే కనిపించదు. ఇక్కడ టబుకు తగ్గట్లుగా ఎవరరైనా మధ్య వయస్కురాలిని తీసుకుంటారని అనుకుంటే తమన్నాను ఆ పాత్రకు ఎంపిక చేసి ఆశ్చర్యపరిచాడు దర్శకుడు మేర్లపాక గాంధీ.
పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్‌కు తమన్నాను ఎంచుకోవడంలోనే ఈ పాత్ర ఔచిత్యం కొంత దెబ్బ తినగా.. ఆమెతో సినిమా అంతటా అందాల విందు చేయించడంతో పాత్ర స్వరూపమే మారిపోయింది. ప్రేక్షకులు ఈ పాత్రను చూసే కోణమే మారిపోయింది. ఎంతో సీనియర్ అయిన నరేష్ పక్కన అంత సెక్సీగా ఉండే తమన్నా పూర్తిగా మిస్ ఫిట్ అయింది.
వీళ్ల జోడీనే చాలా ఆడ్‌గా కనిపించింది. తమన్నా గ్లామర్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్లకు ఆ పాత్ర బాగానే కనెక్ట్ అయి ఉండొచ్చు కానీ.. కథ పరంగా మాత్రం ఆ పాత్ర సూట్ కాలేదు. తమన్నా రాంగ్ కాస్టింగ్ అన్న ఫీలింగ్ కలిగింది ఒరిజినల్ చూసిన వాళ్లందరికీ. ఒరిజినల్లో ఉన్న ఇంపాక్ట్ ఇక్కడ లేకపోవడానికి తమన్నా.. ఆ పాత్రను చేయడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అసలు ఇలాంటి పాత్రకు అనసూయ భరద్వాజ్ అయితే కరెక్టుగా ఉండేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఆమె అయితే నరేష్ పక్కన తమన్నా కన్నా బాగుండేదేమో.
This post was last modified on September 17, 2021 9:08 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…