Kohli and Rohit Sharma
కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. విరాట్ కోహ్లి టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీని వదిలేశాడు. కాకపోతే అతను వన్డే సారథ్యాన్ని కూడా విడిచి పెడతాడని ప్రచారం జరిగింది. కానీ టీ20ల వరకే సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు కోహ్లి. బ్యాట్స్‌మన్‌గా కోహ్లికి తిరుగులేదు కానీ.. కెప్టెన్‌గా అతడికి మరీ గొప్ప పేరేమీ లేదు.
అతడి నాయకత్వంలో జట్టు వివిధ ఫార్మాట్లలో చాలా విజయాలు సాధించింది కానీ.. వన్డే, టీ20ల్లో ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవలేదు. ఐపీఎల్‌లో అతడి నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. అదే సమయంలో రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. దీంతో కోహ్లిని తప్పించి టీ20 పగ్గాలు రోహిత్‌కు అప్పగించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది.
ఇంతకుముందు బ్యాట్స్‌మన్‌గా టాప్ ఫాంలో ఉన్నపుడు కోహ్లి కెప్టెన్సీ వదులుకోవాలన్న డిమాండ్లు మరీ గట్టిగా లేవు. కానీ గత రెండేళ్లలో విరాట్ ఫాం అంత గొప్పగా లేదు. దీంతో డిమాండ్లు పెరిగాయి. ఐతే టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి తప్పుకోనున్న నేపథ్యంలో రోహిత్‌కే పగ్గాలు దక్కుతాయని చాలామంది భావిస్తున్నారు.
కానీ కచ్చితంగా రోహిత్‌నే టీ20 కెప్టెన్‌ను చేస్తారని అనుకోలేం. ఎందుకంటే టీ20లంటే కుర్రాళ్ల ఆట. భవిష్యత్ దృష్టి యువ ఆటగాళ్లకు పగ్గాలందించడం మంచిదనే అభిప్రాయం ఉంది. రోహిత్‌కు ఐపీఎల్‌లో, భారత జట్టుకు నాయకత్వం వహించిన కొన్ని మ్యాచ్‌ల్లో ఎంత మంచి రికార్డున్నప్పటికీ.. అతను కోహ్లి కన్నా రెండేళ్లు పెద్దవాడు.
అతడి వయసు 34 ఏళ్లు. ఈ వయసులో రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం కంటే భవిష్యత్ దృష్ట్యా కేఎల్ రాహుల్ (29 ఏళ్లు), రిషబ్ పంత్ (23 ఏళ్లు) లాంటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వడం మంచిదనే అభిప్రాయాలూ ఉన్నాయి. బీసీసీఐ ఈ దిశగా ఆలోచిస్తుందా.. రోహిత్‌నే ఎంచుకుంటుందా చూడాలి మరి.
This post was last modified on September 16, 2021 9:07 pm
ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే.. ఎక్కువమంది ‘ఫ్యామిలీ మ్యాన్’ పేరే చెబుతారు. దీన్ని మించిన…
ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు…
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన…
రేపు విడుదల కాబోతున్న సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని మాటలు భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి.…
తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
ఏప్రిల్ 25 విడుదల కావాల్సిన కన్నప్ప వాయిదా పడింది. ఒక కీలక ఎపిసోడ్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఎక్కువ…