టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఓ పక్క టీవీ షోలు చేస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తుంటుంది. ‘రంగస్థలం’ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇదే జోరులో కొన్ని సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అనసూయ మెయిన్ లీడ్ గా సాగిన ‘కథనం’ లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినప్పటికీ అనసూయకి అవకాశాలు మాత్రం తగ్గలేదు.
ఇప్పుడో కొత్త డైరెక్టర్ అనసూయను హీరోయిన్ గా పెట్టి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నారట. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకి సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. తన దగ్గర పని చేసిన ఓ అసిస్టెంట్ ను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు సంపత్ నంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని.. అనసూయ తన పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఒకే రకమైన జోనర్ లో నటించడం ఆమెకి నచ్చదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పుష్ప’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, రవితేజ ‘ఖిలాడీ’ సినిమాల్లో నటిస్తోంది. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కూడా అనసూయ కనిపించనుంది.
This post was last modified on September 16, 2021 7:21 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…