‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలియడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మహేష్ బాబు సినిమాకి మధ్యలో మరో సినిమా చేయాలనేది రాజమౌళి ప్లాన్ అట. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారు పాట’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో రాజమౌళి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను తీస్తారట. బాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఒకట్రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి.. మరో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి.. తరువాత ప్రమోషన్స్ కి సమయం కేటాయించి సినిమాను విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. అయితే ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా..? లేక దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటారా అనే విషయంలో క్లారిటీ లేదు.
గతంలో రాజమౌళి తన సినిమా సినిమాకి మధ్యలో ఇలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే రూట్ ని ఫాలో అవ్వబోతున్నారన్నమాట!
This post was last modified on September 16, 2021 2:14 pm
టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్‌లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…