అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్.. తొలిసారి ఈ సమాచారం బయటికి వచ్చినపుడు చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు. షారుఖ్ ఏంటి.. సౌత్ ఇండియన్ డైరెక్టర్‌తో పని చేయడమేంటి.. అందులోనూ పక్కా సౌత్ ఇండియన్ లోకల్, మాస్ సినిమాలు తీసే అట్లీతో షారుఖ్ జట్టు కట్టడం ఏంటి అనిపించింది. కానీ చివరికి నిజంగానే షారుఖ్.. అట్లీతో సినిమాకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది కూడా. పుణెలో తొలి షెడ్యూల్ మొదలుపెట్టారు.
ఇలా షూటింగ్ మొదలైందో లేదో.. అలా ఈ సినిమా టైటిల్ టైటిల్ బయటికి వచ్చేసింది. లయన్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకావడం విశేషం. అనుకోని విధంగా ఈ టైటిల్ మీడియాలోకి వచ్చేసింది.
పుణెలో ఒక ప్రాంతంలో షూటింగ్ అనుమతుల కోసం చిత్ర బృందం పెట్టుకున్న అప్లికేషన్ కాపీ మీడియాలోకి వచ్చేసింది. అందులో సినిమా వివరాలను వెల్లడిస్తూ.. టైటిల్ లయన్ అని పేర్కొన్నారు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు.. ఇందులో షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తున్నట్లు కూడా ఈ అప్లికేషన్లో పేర్కొన్నారు. దర్శకుడిగా అట్లీ కుమార్ అని పూర్తి పేరుంది. మొత్తానికి ఈ చిత్రానికి లయన్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టడంతో షారుఖ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగానే ఉన్నారు.
ఈ టైటిల్‌ను బట్టి అట్లీ.. కింగ్ ఖాన్‌తో మంచి మాస్ మూవీ తీస్తున్నాడనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. జీరో సినిమాతో మార్కెట్ బాగా దెబ్బ తిన్న షారుఖ్.. రెండేళ్లకు పైగా విరామం తీసుకుని పఠాన్ అనే సినిమా మొదలుపెట్టాడు. అది చివరి దశలో ఉండగానే.. అట్లీ సినిమాను పట్టాలెక్కించాడు.
This post was last modified on September 16, 2021 9:55 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…