సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సింగర్ మనో చెప్పే డబ్బింగ్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజినీ స్టైల్‌కు తగ్గట్లుగా అదిరిపోయే రీతిలో డబ్బింగ్ చెబుతుంటారు మనో. అది రజినీ సొంత గొంతు అన్నట్లే ఫీలవుతారు తెలుగు ప్రేక్షకులు. నాన్నా పందులే గుంపుగా వస్తాయ్.. తరహా డైలాగ్స్ మనో ఎంత పవర్ ఫుల్‌గా చెప్పాడో తెలిసిందే.
ఐతే మొదట్లో రజినీకి తెలుగులో గొంతు అరువిచ్చింది మనో కాదు. ‘బాషా’ సినిమా వరకు సాయికుమారే డబ్బింగ్ చెప్పేవాడు. కానీ ‘ముత్తు’ సినిమాలో అనుకోకుండా మనోకు అవకాశం దొరికింది. దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు మనో. ఇక అక్కడి నుంచి దాదాపుగా రజినీ ప్రతి సినిమాకూ మనోనే డబ్బింగ్ చెబుతున్నాడు. తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందో.. తన డబ్బింగ్ పట్ల రజినీ అభిప్రాయమేంటో వివరిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మనో. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
“ముత్తు సినిమా టైంలో సాయికుమార్ కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ‘ముత్తు’ రిలీజ్ డేట్ ప్రకటించాక సాయికుమార్ కోసం ప్రయత్నిస్తే ఆయనకు కుదరలేదు. దీంతో రచయిత శ్రీరామకృష్ణ ఫోన్ చేసి నన్ను అడిగారు. క్లైమాక్స్ సన్నివేశానికి డబ్బింగ్ చెప్పమని, అది నచ్చితే రజినీ ఓకే చేస్తారని అన్నారు. సూపర్ స్టార్‌కి ఒక్క సీన్లో డబ్బింగ్ చెప్పినా చాలు అనుకుని వెళ్లి ఆ పని పూర్తి చేశాను. రజినీ సార్‌కు నచ్చడంతో నన్నే పూర్తిగా డబ్బింగ్ చెప్పమన్నారు. చంద్రముఖి రిలీజయ్యాక ఒక రోజు రాత్రి రజినీ సార్ ఫోన్ చేశారు. నేను రజినీకాంత్‌ను మాట్లాడుతున్నా అనగానే ఎవరో మిమిక్రీ చేసి ఆటపట్టిస్తున్నారనుకున్నా. ఏ రజినీకాంత్ అన్నాను. తర్వాత ఆయనే నిజమైన రజినీ అని తెలిసి సారీ చెప్పాను. చంద్రముఖి తెలుగు వెర్షన్ చూశానని, డబ్బింగ్ అద్భుతంగా చెప్పారని ప్రశంసించారు. ఏం కావాలో కోరుకోమని అడిగితే.. ‘నేనే బిరియాని చేసి పంపిస్తా. తిని పెట్టండి చాలు’ అన్నాను. అంతటి మహానుభావుడికి భోజనం పెట్టే అదృష్టం దక్కింది” అని మనో ఎమోషనల్ అయ్యారు.
This post was last modified on September 15, 2021 3:21 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…