Movie News

కాస్ట్లీ బంగ్లా కొన్న స్టార్ కపుల్!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ అలీబాగ్ ఏరియాలో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఈ ప్రాపర్టీను రిజిస్టర్ చేయించారు. రూ.1.32 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ బయటకొచ్చింది. సౌత్ ముంబైలోని కోస్టల్ టౌన్ అలీబాగ్ లో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్లకు ఆస్తులు ఉన్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ ఏరియాలో బంగ్లాలను కొనగలరు.

ఇప్పుడు దీపికా, రణవీర్ కు కూడా ఈ కొనుగోలుతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం దీపికా, రణవీర్ కలిసి ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. 2010లో దీపికా ఈ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తిల్లు కొనేసింది. వీరి కొత్త బంగ్లా ఏకంగా 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందట. అందులో కొంత నిర్మాణం జరిగిన ఏరియా కాగా.. మిగిలిందని ఖాళీ ప్రదేశమని తెలుస్తోంది.

బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ గా మారారు ఈ భార్యాభర్తలు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో, హీరోయిన్లుగా వీరు రికార్డులు సృష్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ’83’ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం రణవీర్ ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా క్యామియో రోల్ పోషిస్తుంది. మరోపక్క షారుఖ్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది.

This post was last modified on September 15, 2021 2:01 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

34 minutes ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

3 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

3 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

4 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

5 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

5 hours ago