ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇక్కడ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ బిజీ అయింది. ఆ తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి త్రిష పేరు టాలీవుడ్ లో వినిపిస్తోంది. తెలుగులో తెరకెక్కుతోన్న రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా త్రిషను సంప్రదించారట. దాదాపు ఆ ఛాన్స్ ఆమెకే అని అంటున్నారు. గతంలో ఈ బ్యూటీ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో వీరిద్దరి జంటపై విమర్శలు వినిపించాయి. ఆ సినిమాలో చిరు కాస్త బొద్దుగా కనిపించడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలేదు.
చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట త్రిషనే అనుకున్నారు. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో కాజల్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మాత్రం చిరు-త్రిష కాంబినేషన్ సెట్ అవ్వడం పక్కా అంటున్నారు. అలానే బాలయ్య సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకుంటున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా కమిట్ అయ్యారు.
వచ్చే నెలలో ఈ సినిమా మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ గా త్రిష పేరును పరిశీలిస్తున్నారు. బాలయ్య నటించిన ‘లయన్’ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయినప్పటికీ మరోసారి త్రిషను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు త్రిష గ్రీన్ ఇస్తుందేమో చూడాలి!
This post was last modified on September 14, 2021 5:33 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…