వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి భారత క్రీడా చరిత్రలోనే అత్యంత గొప్ప అథ్లెట్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతంతోనే ఆమె లెజండరీ స్టేటస్ తెచ్చుకుంది. ఆమె ఆ పతకం సాధించినపుడు దేశం మొత్తం ఉద్వేగంతో ఊగిపోయింది. రియో ఒలింపిక్స్ తర్వాత సింధుకు దేశంలో దక్కిన ఆదరణ చూసి.. ఆమె జీవిత కథను వెండితెరకు ఎక్కించాలని అనుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.
సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. దాదాపు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ జరిగింది. సింధుతో కలిసి అతడి టీం సుదీర్ఘ కాలం పని చేసింది. ఇక సినిమా మొదలుపెట్టడమే తరువాయి అన్నారు. సింధు పాత్ర చేసే నటి కోసం వేట కూడా సాగింది. కానీ ఏమైందో ఏమో ఎంతకీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.
కరోనా మొదలయ్యాక సింధు సినిమా పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. సోనూ సినిమాల కంటే సామాజిక కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సింధు సినిమా గురించి అతను స్పందించడమే మానేశాడు. ఐతే ఇప్పుడు సింధు సినిమా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ షట్లర్ పాత్ర చేయడమే కాదు.. ఈ సినిమాను నిర్మించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి తన పాత్రను దీపిక చేస్తే బాగుంటుందని సింధు గతంలో స్వయంగా పేర్కొంది.
ఈ మధ్యే టోక్యోలో కాంస్యంతో మరో పతకాన్ని ఖాతాలో వేసుకుని ఇంకా స్థాయిని పెంచుకున్న సింధును తాజాగా దీపికా, ఆమె భర్త రణ్వీర్ సింగ్ డిన్నర్‌కు పిలిచారు. ఈ సమయంలోనే సింధు సినిమాపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సోనూతో డీల్ క్యాన్సిల్ చేసి తన సినిమాను దీపికా, రణ్వీర్‌ల చేతికి సింధు అప్పగించనున్నట్లు బాలీవుడ్లో వార్తలొస్తున్నాయి. దీపికా లెజెండరీ షటర్ల ప్రకాశ్ పదుకొనే కూతురు కావడం ఈ సినిమా చేయడానికి అదనపు అర్హత కావచ్చు. మరి ఛాన్సులు తగ్గి కెరీర్ చరమాంకానికి చేరిన దీపికకు ఈ సినిమా ఏమేర ప్లస్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 14, 2021 3:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…