సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రముఖ నటి నర్గీస్ ఫక్రీ గతంలో నటుడు ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు డేటింగ్ చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండియాలో తను కలిసిన అద్భుతమైన వ్యక్తి ఉదయ్ చోప్రా అని.. ఎంతో మంచివాడని తెలిపింది. తమ రిలేషన్ గురించి ఎప్పుడూ బయట మాట్లాడకపోవడానికి గల కారణాలను వివరించింది.
సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో వచ్చే ఫేక్ న్యూస్ వలన ఇబ్బంది పడాల్సి వస్తుందని.. కాబట్టి తమ బంధం గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడమే మంచిదని చాలా మంది చెప్పారని.. అందుకే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలిపింది. కానీ ఈ విషయంలో రిగ్రెట్ అవుతుంటానని.. తనొక అద్భుతమైన వ్యక్తితో ఉన్నానని.. అందరికీ వినిపించే గట్టిగా అరవాలనిపించేదని చెప్పుకొచ్చింది. రిలేషన్‌షిప్‌లో ఉన్నంతకాలం కూడా వీరిద్దరూ స్నేహితులు అని మాత్రమే చెప్పుకునేవారు.
గతంలో చాలా సార్లు ఉదయ్ చోప్రా ఈ విషయంపై ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. నర్గీస్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని అన్నారు. అయితే మీడియాలో మాత్రం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. 2016లో వీరిద్దరికీ బ్రేకప్ అయింది. ఆ సమయంలో నర్గీస్ సినిమా ప్రమోషన్స్ ఎగ్గొట్టి న్యూయార్క్ కు వెళ్లిపోయింది. ‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘మద్రాస్ కేఫ్’, ‘హౌస్ ఫుల్ 3’ లాంటి సినిమాల్లో నటించింది.
This post was last modified on September 14, 2021 1:00 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…