కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ ట్రేడ్ దృష్టిని అమితంగా ఆకర్షించిన చిత్రం.. సీటీమార్. గత నెలన్నర రోజుల్లో ఇబ్బడిముబ్బడిగా సినిమాలు వచ్చాయి కానీ.. వాటిలో మాస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, వాళ్లను సంతృప్తి పరిచిన సినిమాలు దాదాపుగా ఏవీ లేవనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా దెబ్బకు అల్లాడిపోయిన సింగిల్ స్క్రీన్లలో మళ్లీ కళ తెచ్చే సినిమా కోసం సాగుతున్న నిరీక్షణకు ‘సీటీమార్’ తెరదించింది.
గోపీచంద్ లాంటి యాక్షన్ హీరో లీడ్ రోల్ చేయడం.. మాస్ చిత్రాలకు పెట్టింది పేరైన సంపత్ నంది డైరెక్ట్ చేయడం.. దీని టీజర్, ట్రైలర్ పూర్తిగా మాస్ స్టయిల్లో ఉండటంతో దీనిపై ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఉన్నంతలో మంచి టాకే వచ్చింది. ప్రోమోలు చూసి ఈ సినిమా ఎలా ఉండొచ్చని అనుకున్నారో అలాగే సాగింది. కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో మాస్ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.
తొలి రోజు రూ.3.5 కోట్ల షేర్‌తో కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్‌గా నిలిచిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల వీకెండ్‌ను కూడా బాగానే ఉపయోగించుకుంది. ఈ రెండు రోజుల్లో రూ.4-4.5 కోట్ల మధ్య షేర్ వచ్చినట్లు అంచనా. మొత్తంగా ఇప్పటిదాకా కలెక్ట్ అయిన షేర్ రూ.8 కోట్ల దాకా ఉంది.
కరోనా ముందు అయితే ఈ వసూళ్లు మరీ ఎక్కువేమీ కాదు. కానీ గత ఏడాదిలో వైరస్ ధాటికి థియేట్రికల్ రెవెన్యూపై బాగా ప్రభావం పడింది. జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయింది. ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు నడవట్లేదు. టికెట్ల రేట్ల మీదా నియంత్రణ ఉంది. ఓవర్సీస్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రోజుల్లో రూ.8 కోట్ల వసూళ్లంటే తక్కువేమీ కాదు. వీక్ డేస్‌లో కూడా సినిమా ఓ మోస్తరుగా నడుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా రూ.12 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. అది అంత కష్టమైన విషయం కాకపోవచ్చని, ‘సీటీమార్’ హిట్ మూవీగా నిలవడం ఖాయమని భావిస్తున్నారు.
This post was last modified on September 13, 2021 6:44 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…