ఎన్టీఆర్-కొరటాల సినిమా.. కథ సెట్ అవ్వలేదా..?

NTR

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివతో చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది. నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు కథ కూడా ఓకే అవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనే విషయంపై చిత్రబృందంలో కొందరు స్పందిస్తున్నారు.

ఎన్టీఆర్ కి ఇప్పటికే కొరటాల శివ స్టోరీ లైన్ చెప్పారని.. పూర్తి స్క్రిప్ట్ మాత్రం పూర్తి కాలేదని అంటున్నారు. ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉండడం వలన రాయలేదని.. కథలో మార్పులు అంటూ ఏవీ లేదని చెబుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయలేదని.. స్క్రిప్ట్ పూర్తయితేనే కదా మార్పులు చేర్పులు చేసేదని చెబుతోంది కొరటాల శివ టీమ్. ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన చివరి భాగం షూటింగ్ పూర్తయిన కొంత సమయం తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ మరోసారి స్క్రిప్ట్ గురించి పూర్తిస్థాయిలో చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఎంపిక చేసుకోగా.. రత్నవేలుని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య, నటుడు కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.