ఒకప్పుడు సినిమాల్లో చిన్న బూతు మాట వాడటానికి కూడా జంకేవాళ్లు ఫిలిం మేకర్స్. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చినా పర్వాలేదనుకుని.. కొన్ని బూతు మాటలు పెట్టేస్తున్నారు. సన్నివేశాలు డిమాండ్ చేస్తున్నాయంటూ బూతులు లాగించేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌ల ప్రభావం సినిమాలపై బాగా పడుతోంది.
ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్‌ల్లో బూతుల గురించైతే చెప్పాల్సిన పని లేదు. సహజత్వం పేరుతో పాత్రలు మరీ దారుణంగా బూతులు వాడేస్తుండటం ఓ వర్గం ప్రేక్షకులకు అసలు రుచించట్లేదు. ఐతే సెన్సార్ ఉండదు కాబట్టి.. ఓటీటీ కంటెంట్‌ను చాలా వరకు సెలెక్టివ్‌గా, వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ థియేటర్లలో ఫ్యామిలీస్ వచ్చి చూసే సినిమాల్లో బూతుల విషయంలో కచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే.
ఐతే ‘సీటీమార్’ అనే మాస్ మూవీలో తమన్నా నోటి నుంచి వచ్చిన బూతు మాట అందరికీ పెద్ద షాకే ఇస్తోంది. జ్వాలారెడ్డి అనే తెలంగాణ అమ్మాయి పాత్రను చేసింది తమ్మూ ఇందులో. ఆ పాత్రను ఈ తరానికి తగ్గట్లు కొంచెం అగ్రెసివ్‌గా చూపించాలనుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. ఐతే ఈ క్రమంలో ఒక చోట.. ‘లం..కొడుకు’ అంటూ యధాలాపంగా ఓ బూతు మాట అనేస్తుంది తమన్నా పాత్ర. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ స్వయంగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం.
ఆమె నోట అలాంటి బూతు మాట వచ్చేసరికి జనాలు షాకవుతున్నారు థియేటర్లలో. ఈ చిత్రంలో మరో చోట పోసాని పాత్రతోనూ అదే బూతు మాట పలికించాడు సంపత్. అర్జున్ రెడ్డి తరహా సినిమాల్లో ఇలాంటి బూతులు వినిపిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ.. ‘సీటీమార్’ లాంటి మాస్, ఫ్యామిలీస్ చూసే సినిమాల్లో ఇలాంటి బూతుల అవసరం ఏముందన్నది ప్రశ్న. అసలు సెన్సార్ వాళ్లు ఇలాంటి వాటికి ఎలా ఆమోద ముద్ర వేశారో ఏంటో?
This post was last modified on September 12, 2021 1:38 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…