Movie News

బాక్సాఫీస్‌కు ‘మాస్’ ఊపొస్తుందా?


టాలీవుడ్ మరో కీలక మలుపు దగ్గర నిలబడింది. సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత దాదాపు నెలన్నర వ్యవధిలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో పూర్తిగా ప్రేక్షకులను మెప్పించి వసూళ్ల మోత మోగించిన సినిమా ఒక్కటీ లేదు. కొన్ని చిత్రాలకు మంచి టాక్ వచ్చింది. కానీ వసూళ్లు ఆశించినట్లు రాలేదు. కొన్ని చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ బాగా లేక ఆ సినిమాలు ఎక్కువ రోజులు నిలబడలేదు.

ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా శుక్రవారం విడుదలవుతున్న గోపీచంద్ సినిమా ‘సీటీమార్’పై సినీ పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు అంతగా ఉత్సాహం చూపించని మాస్ ప్రేక్షకుల్లో ఈ చిత్రం కదలిక తెస్తుందని టాలీవుడ్ ఆశిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు చాలా ఆశలే పెట్టుకున్నాయి. సినిమాకు మంచి టాక్ వచ్చి థియేటర్లలో మాస్ జాతర కనిపిస్తుందనే ఆశతో టాలీవుడ్ ఉంది.

ఇంతకుముందు గోపీచంద్‌తో తీసిన ‘గౌతమ్ నంద’తో అంచనాలను అందుకోలేకపోయిన సంపత్ నంది.. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినట్లు చెబుతున్నాడు. టీజర్, ట్రైలర్లలో మాస్ అంశాలకు లోటు లేనట్లే కనిపించింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ను బ్యాలెన్స్ చేస్తూ మాస్ అంశాలను ఎలా పండించారన్నది కీలకం. తమన్నా గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ లాగే కనిపిస్తోంది. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాను ఎలివేట్ చేస్తాయని భావిస్తున్నారు.

గోపీచంద్ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. అతడికి ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం. శుక్రవారం తమిళ చిత్రం ‘తలైవి’ సైతం తెలుగులో రిలీజవుతోంది. ఈ సినిమా ప్రిమియర్లకు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది. జయలలిత బయోపిక్ మీద మన వాళ్లు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారు.. ఆ చిత్రాన్ని ఏమేర ఆదరిస్తారన్నది చూడాలి. మరి చవితి వీకెండ్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ఏమేర కళకళలాడుతుందో చూద్దాం.

This post was last modified on September 10, 2021 1:40 pm

Share

Recent Posts

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

2 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

2 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

5 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

9 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

9 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

10 hours ago