తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. మొదటి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తరువాత కొన్ని స్ట్రెయిట్ సినిమాల్లో నటించింది. ‘సరైనోడు’ లాంటి సినిమాలో విద్యుల్లేఖ కామెడీకి నవ్వకుండా ఉండలేం. తన లుక్స్, డైలాగ్స్ తో ప్రేక్షకులను తెగ నవ్విస్తుంటుంది. చూడడానికి కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ తన శరీరాకృతిపై దృష్టి పెట్టి జిమ్ లో కసరత్తులు చేసి స్లిమ్ గా తయారైంది.
ఆమె స్లిమ్ లుక్ చూసిన నెటిజన్లు షాకయ్యారు. అంతగా ఛేంజ్ ఓవర్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు. ఫిట్ నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్ తో ప్రేమలో పడినట్లు వెల్లడించింది. ఆగస్టు 26న వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సడెన్ గా ఆమె ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోలీవుడ్ నాట హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి కూడా చేసేసుకుంది.
ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో కూడా ఆమె పెళ్లి తేదీపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ సెప్టెంబర్ 9న ఆమె వివాహ వేడుక వైభవంగా జరిగింది. తమిళ సాంప్రదాయంలో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
This post was last modified on September 10, 2021 11:04 am
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…