‘కబాలి’ టైంకి సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. చిన్న టీజర్ వదిలి మొత్తం దేశాన్ని ఊపేశాడు సూపర్ స్టార్. కానీ రజినీకాంత్ క్రేజ్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లిన ఆ చిత్రమే.. ఆయన కెరీర్ తిరోగమనానికి కారణమైంది. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఇక్కడి నుంచి రజినీ క్రేజ్, మార్కెట్ పడుతూ వచ్చాయి. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘దర్బార్’ సినిమాతో రజినీ స్థాయి చాలా తగ్గిపోయింది. తెలుగులో రూ.30-40 కోట్ల మధ్య బిజినెస్ చేసే ఆయన చిత్రాలు రూ.10 కోట్ల మార్కును కూడా అందుకోలేని పరిస్థితి వచ్చింది.
తమిళంలో కూడా రజినీ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఆయన పుంజుకోవాలంటే మంచి మాస్ హిట్ పడాల్సిన అవసరముంది. ‘అన్నాత్తె’ అలాంటి సినిమానే అవుతుందన్న అంచనాలున్నాయి. తెలుగులో శౌర్యం.. తమిళంలో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి విజయాలతో పెద్ద రేంజికి వెళ్లిన శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రాన్ని రెండు నెలల కిందటే రజినీ పూర్తి చేసేశారు. దీపావళికి విడుదల ఖరారైన సంగతి తెలిసిందే. షూటింగ్ అయ్యాక ఈ సినిమా గురించి అప్‌డేటే లేదు.
ఐతే ఎట్టకేలకు చిత్ర బృందం మౌనం వీడింది. దీపావళి రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్లకు రంగం సిద్ధం చేసింది. వినాయక చవితి కానుకగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ‘అన్నాత్తె’ ఫస్ట్ లుక్, సాయంత్రం 6 గంటలకు మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సమాచారం పంచుకుంటూ ఒక ప్రి లుక్ పోస్టర్ కూడా వదిలింది చిత్ర బృందం. మామూలుగా రజినీ సినిమాలకు తెలుగులో ఒకేసారి టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తుంటారు. ఐతే ‘అన్నాత్తె’ తెలుగు వెర్షన్ టైటిలేంటి ఇప్పటిదాకా వెల్లడించలేదు. ఫస్ట్ లుక్‌తో పాటే తెలుగు టైటిల్ కూడా వెల్లడిస్తారేమో చూడాలి.
This post was last modified on September 9, 2021 2:53 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…