సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. థియేటర్లకు క్యూ కడుతుంటారు. తాజాగా ఈ హీరో నటించిన ‘నారప్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాపై వెంకీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు కూడా. కానీ ఈ సినిమా రిజల్ట్ నిరాశ పరిచింది. ఓటీటీలో రిలీజ్ కావడం కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపించిందని వెంకీ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు దృశ్యం 2′ సినిమాపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
ఎందుకంటే ఈ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఓటీటీ రిజల్ట్ పట్ల ఎలాంటి ఆసక్తి లేని వెంకీ.. ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఎఫ్ 3’ సినిమా ఉంది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా దాన్ని మించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు మరో సినిమాపై ఫోకస్ చేయడకూడదని వెంకీ ఫిక్స్ అయ్యారట. అందుకే తన దగ్గరకు వస్తోన్న కొత్త కథలను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం.
నిజానికి వెంకీ కోసం చాలా కాలంగా ఓ రీమేక్ కథ రెడీగా ఉంది. అదే ‘విక్రమ్ వేద’. ఈ సినిమాపై మొదట్లో వెంకీ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇప్పుడు తనకు రీమేక్ లు పెద్దగా కలిసి రావడం లేదని ఈ కథను పక్కన పెట్టేశారు. ఇక వెంకీ కోసం తరుణ్ భాస్కర్ ఓ కథ రెడీ చేస్తున్నారు. ఆ కథ సెట్ అయితే వెంకీ సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఆ కథ పూర్తి కావడం లేదు. దీంతో కొన్నాళ్లపాటు కొత్త కథల జోలికి పోకూడదని వెంకీ నిర్ణయించుకున్నారు.
This post was last modified on September 9, 2021 2:08 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…