సినిమా ఇండస్ట్రీ ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. ఎవరైనా హీరో, హీరోయిన్లు కాస్త క్లోజ్ గా ఉంటే చాలు.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం సాగుతుంది. ఇప్పుడే కాదు.. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతోంది. 1970లలో హీరోయిన్ రేఖ గురించి ఇలాంటి వార్తలే వచ్చేవి. తన గ్లామర్, నటనతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన రేఖ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కానీ మీడియాలో మాత్రం ఎక్కువగా ఆమె లవ్ లైఫ్ కి సంబంధించిన వార్తలే వచ్చేవి.
అందులో ఒకటి రేఖ-వినోద్ మెహ్రాల ప్రేమ వ్యవహారం. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయం వినోద్ ఫ్యామిలీకు ఇష్టం లేదు. ముఖ్యంగా వినోద్ తల్లి రేఖను బాగా వ్యతిరేకించేవారు. అది ఏ రేంజ్ లో అంటే.. ఒకరోజు రేఖ-వినోద్ మెహ్రాలు ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా కోల్‌కతాలో పెళ్లి చేసేసుకున్నారు. ఆ తరువాత వినోద్ మెహ్రా.. రేఖను తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తల్లికి తాను పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. అది విన్న వినోద్ తల్లి.. రేఖ మీద కోపంతో చెప్పుతో కొట్టడానికి వెళ్లారు. వినోద్ ఎంతగా ప్రయత్నించినా.. తన తల్లిని కంట్రోల్ చేయలేకపోయారు. రేఖను ఆమె తీవ్రంగా అవమానించారు.
ఆ అవమానాలు తట్టుకోలేక రేఖ ఏడ్చుకుంటూ వినోద్ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు వినోద్ తో టచ్ లో ఉన్నారు రేఖ. అనంతరం ఇద్దరూ విడిపోయారు. దీని గురించి రేఖ ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. వినోద్ మెహ్రా తల్లి దృష్టిలో తను కేవలం ఒక నటిని మాత్రమే అని.. గతంలో ఎన్నో చేదు అనుభవాలు కలిసి వినోద్ తల్లి తన కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత రేఖ ఢిల్లీకి చెందిన ముఖేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే ముఖేష్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ సమయంలో కూడా అందరూ రేఖనే అనుమానించారు.
This post was last modified on September 9, 2021 12:15 pm
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…