కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లు ఎంతగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. అందులోనూ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి దారుణాతి దారుణం. మల్టీప్లెక్సులను మెయింటైన్ చేసే సంస్థల స్థాయి వేరు. అవి ఎలాగోలా నిలబడతాయి. కానీ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి అలా కాదు. మెయింటైనెన్స్ అంత తేలిక కాదు. వాటి కెపాసిటీ ఎక్కువ. మల్టీప్లెక్సుల్లో మాదిరి వంద, రెండొందల సీట్లతో చిన్న స్క్రీన్లు పెట్టి చిన్న సినిమాలతో లాగించేసే పరిస్థితి ఇక్కడ ఉండదు. చిన్న స్థాయి, క్లాస్ సినిమాలతో సింగిల్ స్క్రీన్ల బండి నడవదు. అవి కళకళలాడాలంటే మాస్ మసాలా సినిమాలు, పెద్ద హీరోలు నటించినవి రావాలి.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత గత ఐదు వారాల్లో చాలా సినిమాలే రిలీజయ్యాయి. వాటిలో ఏదీ కూడా సింగిల్ స్క్రీన్లలో కళ తేలేకపోయింది. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ లాంటి చిత్రాలకు తొలి రోజు కొంచెం సందడి కనిపించింది. తర్వాత థియేటర్లు వెలవెలబోయాయి.
ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్లకు ప్రాణం పోసే సినిమా కోసం సాగుతున్న నిరీక్షణకు ‘సీటీమార్’ తెరదించేలా ఉంది. యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఈ చిత్రంపై మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న ఇలాంటి సినిమా కోసమే మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. సింగిల్ స్క్రీన్లకు సందడి తెచ్చేది ఇలాంటి సినిమాలే. లేక లేక ఇలాంటి సినిమా వస్తుండటంతో ఎగ్జిబిటర్లు చాలా ఆశలతో ఉన్నారు.
గోపీచంద్.. తమన్నా.. సంపత్ నంది.. మణిశర్మ.. ఇలా మాస్ కోరుకునే కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. దీని టీజర్, ట్రైలర్లు చూస్తే కమర్షియల్ అంశాలకు ఢోకా లేదని అర్థమైంది. వినాయక చవితి కానుకగా రిలీజవుతున్న ఈ చిత్రానికి బుకింగ్స్ కూడా పర్వాలేదు. కచ్చితంగా ఈ వీకెండ్లో సింగిల్ స్క్రీన్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుందన్న అంచనాతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
This post was last modified on September 8, 2021 1:49 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…