‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూతో ఓ ఫోటోషూట్ ను నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనుకుంటున్న శంకర్ ఓ పేరుని అనుకున్నారట.
అదేంటంటే.. ‘విశ్వంభర’. దీనికి అర్ధం భూమి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ కి కూడా టైటిల్ నచ్చిందట. దీంతో పాటు మరో రెండు, మూడు టైటిల్ అనుకుంటున్నారు. కానీ దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడంతో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయంలో శంకర్ కి యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ సహాయం చేస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
This post was last modified on September 7, 2021 10:07 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…