తెలుగమ్మాయిలకు కథానాయికలుగా ఓ మోస్తరు అవకాశాలు రావడమే కష్టం. అలాంటిది ఓ తెలుగమ్మాయి తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంతో వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ లాంటి పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని దశాబ్దంన్నర పాటు కెరీర్ సాగించడం అంటే చిన్న విషయం కాదు. ఈ అరుదైన ఘనత సాధించింది అంజలి.
అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి.. ‘మనీ’ దర్శకుడు శివ నాగేశ్వరరావుతో ‘ఫొటో’ అనే చిన్న సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. తెలుగులో తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ టైంలోనే కోలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి అవకాశాలు అందుకుంది. షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాల్లో గొప్ప నటనతో అక్కడ బిజీ హీరోయిన్ అయిపోయింది. రచ్చ గెలిచాక ఇంటికొచ్చి ఇక్కడా సత్తా చాటుకుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో తెలిసిందే. ఒక ఐదారేళ్ల పాటు అటు తమిళంలో, ఇటు తెలుగులో అంజలి మంచి రేంజిలో ఉంది. కానీ తర్వాత ఆమె జోరు తగ్గింది. తమిళంలో ఓ దర్శకుడితో వివాదం అంజలి కెరీర్‌పై ప్రభావం చూపింది. కొన్నాళ్లు అక్కడ సినిమా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితి తలెత్తింది. ఐతే ఆ టైంలోనే తెలుగులో ఆమె జోరు సాగింది. తర్వాత తిరిగి కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చినా సరైన హిట్లు పడక అంజలి జోరు తగ్గింది.
ఐతే ఒకప్పటంత ఊపు లేకపోయినా అంజలికి సినిమాలైతే ఆగిపోలేదు. అడపా దడపా పేరున్న చిత్రాల్లోనే కనిపిస్తోంది. ఒకప్పుడు బాగా బొద్దుగా ఉన్న అంజలి.. ఈ మధ్య బాగా బరువు తగ్గి కెరీర్‌ను పొడిగించుకునే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి ఓ తెలుగమ్మాయి ఇలా 15 ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించడం, రెండు భాషల్లో పేరున్న కథానాయికగా పేరు సంపాదించడం గొప్ప విషయమే.
This post was last modified on September 6, 2021 7:14 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…