కరోనా సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో ఒక్కొక్కటిగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా అని ఓటీటీని పక్కన పెట్టలేదు. సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా.. సరైన వసూళ్లు మాత్రం రావడం లేదు. ఇప్పటికీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. అందుకే నిర్మాతలు ఇంకా ధైర్యం చేయలేకపోతున్నారు. ఆ కారణంగానే ‘టక్ జగదీష్’ లాంటి క్రేజీ ఫిల్మ్ ఓటీటీకి వెళ్లింది.
ఈ వారమే ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. అయితే అదే రోజున థియేటర్లలో ‘సీటీమార్’ సినిమా సందడి చేయబోతుంది. ఈ వారంలో విడుదలయ్యే పేరున్న సినిమాలు ఇవే. ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనడం కంటే.. థియేటర్ ఓటీటీ మధ్య పోటీ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. ‘టక్ జగదీష్’ ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ లో వస్తోంది. నాని సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. నిజానికి ‘టక్ జగదీష్’ అనేది థియేటర్లో విడుదల కావాల్సిన సినిమా.
కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. వినాయకచవితికి ఈ సినిమా వస్తుండడంతో పండగ హడావిడి మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఓటీటీలో ఈ సినిమాను ఎంతమంది చూశారనే రికార్డులు బయటకు రావు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ‘టక్ జగదీష్’ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
అదే రోజున వస్తున్న ‘సీటీమార్’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది మంచి మాస్ సినిమా కాబట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తే గనుక మరిన్ని సినిమాలు థియేటర్లోకి వస్తాయి.
This post was last modified on September 6, 2021 11:25 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…