హీరోగా బండ్ల గణేష్.. కొన్ని రోజుల కిందట మీడియాలో హల్‌చల్ చేసిన వార్త ఇది. నటుడిగా చాలా సినిమాలే చేసినా.. చాలా వరకు పెద్దగా గుర్తింపు లేని పాత్రలే చేశాడు బండ్ల గణేష్. అందులో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించిన, సహాయ పాత్రలు ఎన్నో. ఐతే నిర్మాతగా మాత్రం చాలా పెద్ద స్థాయి సినిమాలే చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో నటనకు దూరమయ్యాడు.
ఈ మధ్య సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చిన్న పాత్రతో మెరిసిన బండ్ల.. కెరీర్లో ఈ దశలో హీరో కాబోతున్నాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వార్త గురించి బండ్లను సోషల్ మీడియాలో ప్రశ్నించినా.. మొన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పేస్‌లో అడిగినా సమాధానం దాట వేస్తూ వచ్చాడు. ఈ వార్తను ఖండించలేదు. అలాగే ధ్రువీకరించనూ లేదు. ఐతే ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.
బండ్ల గణేష్ లీడ్ రోల్‌లో సినిమా మొదలైపోయింది. నుదుటిపై గాయంతో అమాయకంగా కనిపిస్తున్న బండ్ల గణేష్ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. టేబుల్ మీద పోలీస్ టోపీ, వాకీ టాకీని బట్టి బండ్ల స్టేషన్లో ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన ఒత్త సెరుప్పు సైజ్ 7 ఆధారంగా తెరకెక్కుతోంది.
తమిళంలో ప్రముఖ నటుడు, దర్శకుడు పార్తీబన్ తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్వకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో కేవలం ఒక్క పాత్రే ఉంటుంది. తమిళంలో మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకుని కమర్షియల్‌గానూ సక్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తుండటం విశేషం. తెలుగులో బండ్ల హీరోగా వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. స్వాతి చంద్ర, రిషి అగస్త్య నిర్మాతలు.
This post was last modified on September 5, 2021 10:31 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…