సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అంటారు. సక్సెస్ రేట్ మరీ తక్కువైన సినీ రంగానికి ఇది మరింతగా వర్తిస్తుంది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయి వరుసగా అవకాశాలు దక్కించుకున్న కార్తికేయ.. జాగ్రత్తగా అడుగులు వేయలేకపోయాడు. గత మూడేళ్లలో అరడజనుకు పైగానే సినిమాలు చేశాడు కానీ.. ఒక్కటి కూడా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
తమిళంలో కలైపులి థాను.. తెలుగులో అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతల సంస్థల్లో సినిమాలు చేసినా కూడా చేదు అనుభవాలు తప్పలేదు. హిప్పి నుంచి చావు కబురు చల్లగా వరకు అన్నీ డిజాస్టర్లే ఎదురయ్యాయి. దీంతో కార్తికేయ కెరీర్ డోలాయమానంలో పడిపోయింది. ఎంత వేగంగా పైకెగిరాడో అంతే వేగంగా కింద పడ్డ అతను.. ఇంకో ఫ్లాప్ ఎదుర్కొంటే ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోతాడేమో అనే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడతడి హిట్టు చాలా చాలా అవసరం.
అలాంటి స్థితిలో వస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్‌గా నటించడం విశేషం. ఈ సినిమా టీజర్ శనివారం రిలీజ్ చేశారు. నిమిషంన్నర నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హీరో ఎన్ఐఏ ఎజెంట్ అనగానే సినిమా సీరియస్‌గా ఉంటుందనుకుంటాం కానీ.. ఈ చిత్రం మాత్రం పూర్తి వినోదాత్మకంగా సాగేలా కనిపిస్తోంది. అలాగే యాక్షన్ ఘట్టాలకూ ప్రాధాన్యం ఉన్నట్లుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా కనిపించాయి. కొంచెం కొత్తగా ఉంటూనే కమర్షియల్ అంశాలకు, హీరోయిజానికి లోటు లేని విధంగా సినిమా కనిపిస్తోంది.
గత మూడేళ్లలో కార్తికేయ పేలవమైన సినిమాల ఎంపికతో ఉన్న క్రేజంతా పోగొట్టుకున్నాడు. ఎట్టకేలకు అతనో మంచి స్క్రిప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అతడి కెరీర్‌ను మళ్లీ రైట్ ట్రాక్ ఎక్కించేలాగే కనిపిస్తోంది ‘రాజా విక్రమార్క’. మరి టీజర్ లాగే సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
This post was last modified on September 4, 2021 4:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…