ధర్డ్ వేవ్ సోనూసూద్ షాకింగ్ కామెంట్స్..!

దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది. తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. సినీ నటుడు, రియల్ హీరో ఈ థర్డ్ వేవ్ పై చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

దేశంలో నిరుద్యోగ సమస్య, పేదరికంతో ఇప్పటికే థర్డ్‌వేవ్‌ ను అనుభవిస్తున్నామని అన్నారు సోనూసూద్. భారత్ లో థర్డ్ వేవ్ వస్తుందా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా మాట్లాడారు.

తనను ఒకరు దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా అని అడిగారని.. నిరుద్యోగం థర్డ్ వేవ్ లాంటిదేనని తాను చెప్పానని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. నిరుద్యోగం కరోనా థర్డ్‌వేవ్ కంటే తక్కువేమి కాదన్నారు సోనూ. పేదలకు సాయం, ఉపాధి కల్పించడమే దీనికి అసలైన మందు అని ట్వీట్ చేశారు. సోనూ ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉందని కొందరు అంటుంటే.. డబ్బున్న వాళ్లు సాయం చేయడానికి ముందుకొచ్చేలా ఉందని మరికొందరు అంటున్నారు.