టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుంచి ఇప్పటికే ఓ వారసుడొచ్చాడు. అతనే.. హర్షిత్ రెడ్డి. రాజు మేనల్లుడైన ఇతను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నాడు. తనే నిర్మాతగా లవర్ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఆ తర్వాత ఎస్వీసీలో సహ నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాజు కుటుంబం నుంచి మరో వారసుడు రెడీ అయ్యాడు. అతను అరంగేట్రం చేస్తోంది నిర్మాణంలో కాదు.. నటనలో.
రాజు తమ్ముడు, ఎస్వీసీ అధినేతల్లో ఒకడైన శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హుషారు చిత్రంతో దర్శకుడిగా సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చిన హర్ష ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ మధ్యనే చాలా హంగామా మధ్య ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. దాని వేడుక కూడా చాలా ఘనంగా చేశారు. ఇక తమ్ముడి కొడుకు అరంగేట్ర సినిమా కోసం టెక్నికల్ టీంను గట్టిగానే సెట్ చేశాడు దిల్ రాజు. సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. శ్రీమంతుడు, ఘాజి, సాహో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ మధి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూరుస్తుండటం విశేషం. అలాగే దక్షిణాదిన లెజెండరీ టెక్నీషియన్లలో ఒకడిగా పేరున్న రాజీవన్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ చేస్తుండటం గమనార్హం. ఆయన చివరగా సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి పని చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్.
మొత్తంగా చూస్తే రాజు.. తన తమ్ముడి కొడుకును అరంగేట్రం చేయించే విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదని.. ఓ రేంజిలో ఖర్చు పెట్టి బెస్ట్ ఔట్ పుట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని స్పష్టమవుతోంది.
This post was last modified on September 4, 2021 11:30 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…