పూరి జగన్నాథ్ టాలీవుడ్లో చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. ఇమేజ్ లేని హీరోలను స్టార్లను చేయడంలో, స్టార్లను సూపర్ స్టార్లను చేయడంలో పూరి ట్రాక్ రికార్డు గొప్పదే. కానీ బయటి హీరోలకు తిరుగులేని విజయాలను కట్టబెట్టిన పూరి జగన్నాథ్.. తన కొడుకు ఆకాశ్‌ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. తాను బ్యాడ్ ఫామ్‌లో ఉండగా ‘మెహబూబా’ లాంటి డిజాస్టర్ మూవీ తీసి కొడుకు కెరీర్‌ను డోలాయమానంలోకి నెట్టాడు.
ఇలా పూరి పంచ్ తిన్న మరో కొత్త కుర్రాడు కూడా ఉన్నాడు. అతనే.. కన్నడ నటుడు ఇషాన్. శాండిల్‌వుడ్లో పెద్ద నిర్మాతల్లో ఒకడైన మనోహర్ కొడుకితను. కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, తెలుగులో రామ్ చరణ్‌లను హీరోలుగా పరిచయం చేసి వాళ్లు పెద్ద స్టార్లు కావడానికి పునాది వేసిన పూరి మీద ఎంతో నమ్మకంతో ఇషాన్‌ను ‘రోగ్’ అనే మూవీతో లాంచ్ చేయించారు.
పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అటు కన్నడలో, ఇటు తెలుగులో డిజాస్టర్ అయింది. డబ్బులు పోయాయి. కొత్త హీరోకు విజయం దక్కలేదు. మొత్తంగా ఇషాన్ కెరీర్ అయోమయంగా తయారైంది. ఆ తర్వాత కన్నడలో రెమో అనే సినిమా ఒకటి చేశాడు. అది కూడా అంతగా ఫలితాన్నివ్వలేదు. అయినా ఇషాన్ ప్రయత్నం ఆపలేదు. ఇప్పుడతను ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. తత్వమసి. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ లాంటి పేరున్న ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తేలు నిర్మిస్తున్నాడు.
ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్ లుక్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. మ్యాన్లీ లుక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించే ఇషాన్.. ఈ సినిమాతో అయినా మంచి విజయాన్నందుకుని హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.
This post was last modified on September 2, 2021 12:52 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…