ఒక సినిమాకు పాటలు ఒక సంగీత దర్శకుడు కంపోజ్ చేస్తే.. నేపథ్య సంగీతం మరొకరు సమకూర్చడం మామూలే. తెలుగులో ఇలాంటి కాంబినేషన్లు చాలా చూశాం. బ్యాగ్రౌండ్ స్కోర్ చేయడంలో తిరుగులేదని పేరున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో కొందరు దర్శకులు కేవలం ఆర్ఆర్ మాత్రమే చేయించుకున్నసినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న తమన్ కూడా కొన్ని చిత్రాలకు కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇచ్చాడు. అందులో.. మజిలీ మూవీ కూడా ఒకటి.
ఈ చిత్రానికి పాటలు సమకూర్చింది గోపీసుందర్. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ తొలి చిత్రం ‘నిన్ను కోరి’కి కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. దానికి నేపథ్య సంగీతం కూడా అతనే ఇచ్చాడు. కానీ ‘మజిలీ’ విషయంలో ఏదో తేడా జరిగింది. గోపీ చాలా బిజీగా ఉండి అనుకున్న సమయానికి ఆర్ఆర్ ఇవ్వకపోవడంతో హడావుడిగా తమన్‌తో ఆ పని పూర్తి చేయించారు. ఆ సందర్భంగా గోపీ తీరుపై శివ కొంచెం అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు. ఇది చూసి మళ్లీ గోపీతో శివ పని చేయడని అనుకున్నారు. అందుకు తగ్గట్లే తన కొత్త చిత్రం ‘టక్ జగదీష్’కు తమన్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు శివ.
ఈ చిత్రానికి ఆటోమేటిగ్గా తమనే నేపథ్య సంగీతం కూడా ఇచ్చి ఉంటాడని భావించారంతా. కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా కోసం తమన్ పాటలు మాత్రమే ఇచ్చాడు. నేపథ్య సంగీతం బాధ్యత గోపీ సుందర్‌కు అప్పగించాడు శివ. ఇలాంటి మాస్ టచ్ ఉన్న సినిమాలకు తమనే సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తాడనుకుంటాం కానీ.. అతను బిజీగా ఉన్నాడో లేక, ‘మజిలీ’ బాకీ తీర్చడానికి గోపీని తీసుకొచ్చారో తెలియదు కానీ.. అతనే దీనికి నేపథ్య సంగీతం అందించడం గమనార్హం. ఈ ఎక్స్‌చేంజ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
This post was last modified on September 2, 2021 12:52 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…