సినీ సెలబ్రిటీలపై పుకార్లు రావడం కామన్. వీటిని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హ్యాండిల్ చేస్తుంటారు. కొందరేమో వెంటనే రియాక్ట్ అయి తమపై వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతుంటారు. కొందరు మాత్రం అసలు పట్టించుకోకుండా ఆ రూమర్స్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు సమంత కూడా ఇలానే చేస్తుంది. ఈ మధ్యకాలంలో సమంతపై ఓ రూమర్ బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సామ్ కాపురం సజావుగా సాగడం లేదని.. ఆమె తన భర్త నుండి విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రీసెంట్ గా నాగార్జున పుట్టినరోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడం.. ఆమె సినిమాల నుండి బ్రేక్ తీసుకోవడం ఇవన్నీ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లైంది. అసలు ఈ వార్తలు ఎందుకు పుట్టుకొచ్చాయనే విషయం పక్కన పెడితే.. ఇదొక సెన్సిటివ్ మేటర్. ఎక్కువ రోజులు ఇలానే నానుస్తూ ఉండడం మంచిది కాదు. కానీ సమంత మాత్రం అవేం పట్టించుకోవడం లేదు.
తన వైవాహిక జీవితంపై ఎన్ని రూమర్లు వస్తున్నా.. సమంత మాత్రం పట్టించుకోకుండా మాన్ సూన్ సీజన్ ను ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ సైకాలజిస్ట్ చెప్పిన కొటేషన్ ను షేర్ చేసిన సమంత.. పుకార్లను పట్టించుకోవద్దు అనే విధంగా రియాక్ట్ అయింది. ఆమె కామెంట్ ని బట్టి తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించకూడదని సమంత నిర్ణయించుకున్నట్లుంది.
This post was last modified on September 1, 2021 11:42 am
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…