కరోనా మహమ్మారి పుణ్యమా అని ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సినిమాలు నెలలు, సంవత్సరాలు వాయిదా పడిపోతున్నాయి. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా ప్రభావితం కావడంతో అన్ని సినీ పరిశ్రమలూ కుదేలయ్యాయి. హాలీవుడ్ సైతం కరోనా ధాటికి విలవిలలాడింది. ఎప్పుడో 2020 వేసవికే రావాల్సిన జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ల తర్వాత ఈ సినిమాను విడుదల చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ‘నో టైం టు డై’ని రిలీజ్ చేయడానికి నిర్మాణ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఈసారి కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా.. ట్రైలర్ సైతం లాంచ్ చేసింది.
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడవట్లేదు. అయినా సరే.. మరోసారి బాండ్ మూవీని వాయిదా వేయాలని మేకర్స్ అనుకోవట్లేదు. ‘నో టైం టు డై’ ట్రైలర్ చూస్తే యాక్షన్ ప్రియులకు, బాండ్ సినిమా లవర్స్‌కు కనువిందు ఖాయమనిపిస్తోంది. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో ట్రైలర్ వారెవా అనిపించింది. కథ పెద్దగా రివీల్ కాలేదు కానీ.. బాండ్ గారి కొత్త మిషన్ చాలా ఎగ్జైటింగ్‌గానే ఉండబోతోందని అర్థమవుతోంది.
‘టెనెట్’ సహా గత ఏడాది వ్యవధిలో వచ్చిన భారీ హాలీవుడ్ చిత్రాలు చాలా వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. మరి బాండ్ మూవీ ప్రతికూల పరిస్థితుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి. 2006లో ‘క్యాసినో రాయల్’తో బాండ్ అవతారం ఎత్తి.. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్టర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించిన డేనియల్ క్రెయిగ్‌కు బాండ్ పాత్రలో ‘నో టైం టు డై’నే చివరి సినిమాగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేరీ జోజి రూపొందించాడు.
This post was last modified on September 1, 2021 11:34 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…