మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఆ చిత్రం మే 13నే విడుదల కావాల్సింది. కానీ వైరస్ మరోసారి విజృంభించడంతో చాలా సినిమాల్లాగే ఇది కూడా వాయిదా పడింది.
సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత షూటింగ్ పున:ప్రారంభించి బ్యాలెన్స్ పార్ట్ పూర్తి చేసినప్పటికీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా స్పష్టత రావట్లేదు. ముందేమో దసరా రిలీజ్ అన్నారు కానీ.. గత కొన్ని రోజుల పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.
‘ఆచార్య’ సంక్రాంతికి వస్తుందని.. కాదు కాదు క్రిస్మస్ రేసులో నిలవబోతోందని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఐతే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’.. క్రిస్మస్‌కు అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’ రిలీజవుతుండగా.. వాటికి పోటీగా చిరు తన చిత్రాన్ని రేసులో నిలిపి వివాదానికి కారణమవుతాడని అనుకోలేం. వీలైనంత వరకు దసరా రిలీజ్‌కే ప్రయత్నిద్దామనుకున్నారు కానీ.. అప్పటికి ‘ఆచార్య’ను సిద్ధం చేయడం కష్టమేనట.
అందుకే మధ్యే మార్గంగా టాలీవుడ్ ఎప్పుడూ అంతగా దృష్టిపెట్టని మరో పండుగ మీద ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. నవంబరు తొలి వారంలో దీపావళి కానుకగా ‘ఆచార్య’ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం చూస్తోందట. దీపావళికి తమిళం, హిందీ భాషల్లో భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. హిందీ మార్కెట్ ఇంకా పుంజుకోకపోవడంతో ఈసారి దీపావళికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజయ్యేలా లేవు.
తమిళంలో మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘అన్నాత్తె’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ చిత్రం తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది. మరి చిరు దీపావళికి ఫిక్సయితే.. రజినీతో తలపడబోతున్నాడన్నమాట. చిరు వెర్సస్ రజినీ.. ఎవ్వరూ ఊహించని ఈ బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 31, 2021 9:12 pm
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…