ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవారికే విలువ. ఒక్కసారి హిట్ పడిందంటే చాలు వరుస అవకాశాలు వస్తుంటాయి. అదే ప్లాప్ పడితే మాత్రం ఇక అంతే సంగతులు. అయితే సూపర్ హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ఖాళీగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి తారలను ఇండస్ట్రీకి అందించారు.
ఇంత చేసినా.. కూడా ఇప్పటివరకు బుచ్చిబాబు రెండో సినిమా అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకొని ఆయనకు వినిపించారు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ వలన వీరి కాంబో ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. మైత్రి మూవీస్ బ్యానర్ లోనే వైష్ణవ్ హీరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా బిజీ అయిపోయారు. తను నటించిన ‘కొండపొలెం’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ లో మరో సినిమా చేయాల్సివుంది. ఇది కాకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నారు. వీటి మధ్య బుచ్చిబాబుకి డేట్స్ ఇవ్వడం వైష్ణవ్ కి కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు మరో యంగ్ హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. మరి తన కథకు సూటయ్యే హీరో దొరుకుతాడో లేదో చూడాలి!
This post was last modified on August 31, 2021 9:09 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…