అక్కినేని నాగచైతన్యకు సూటయ్యే బెస్ట్ రోల్ అంటే.. లవర్ బాయ్‌మే. అతను కెరీర్లో మెజారిటీ విజయాలందుకుంది ప్రేమకథలతోనే. ఐతే ఫక్తు ప్రేమకథలతో సరిపెట్టుకుండా వాటికి కొంచెం స్లైస్ ఆఫ్ లైఫ్ టచ్ ఇవ్వడం ద్వారా అతను మంచి ఫలితాలు అందుకుంటున్నాడు.
మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’ ఆ టైపు సినిమానే. ‘మజిలీ’లో కూడా కొంచెం అలాంటి టచ్ ఉంటుంది. ఐతే ‘ప్రేమమ్’ చైతూకు బాగా సెట్ అయిన సినిమా. ఇలాంటి కథలతో సినిమాలు చేస్తే భాషతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. మెజారిటీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటించిన ‘థ్యాంక్ యు’ అచ్చంగా అలాంటి సినిమానేనట. ఇందులో ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లోని పరిణామాలను చూపించబోతున్నారట. లవ్ టచ్ ఇస్తూనే జీవిత సారాన్ని తెలిపేలా ఈ సినిమా నడుస్తుందట.
అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్న ‘థ్యాంక్ యు’ రైటర్ బీవీఎస్ రవి.. ఈ సినిమాలో చైతూ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో వివరించాడు. చైతూ ఇందులో మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో.. డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తాడని వెల్లడించాడు.
ముందుగా కాలేజీ రోజుల్లో స్టూడెంట్ లీడర్‌గా చైతూ కనిపిస్తాడని… ఆ తర్వాత జీవితం మీద గొప్ప కలలు కనే యువకుడిగా కనిపిస్తాడని.. ఆపై పరిణితి చెందిన మధ్య వయస్కుడిగా దర్శనమిస్తాడని.. ఒక వ్యక్తి జీవితాన్ని వివిధ కోణాల్లో చూపించే సినిమా ఇదని రవి వెల్లడించాడు. ఈ మాటలు వినగానే ‘ఆటోగ్రాఫ్’, ‘ప్రేమమ్’ సినిమాలు గుర్తుకు రావడం సహజం.
తమిళ రీమేక్ అయిన ‘ఆటోగ్రాఫ్’ చాలా మంచి సినిమా అయినా అది తెలుగులో సరిగా ఆడలేదు. ‘ప్రేమమ్’ మాత్రం రీమేక్ చేస్తున్నపుడు నెగెటివిటీ ఎదుర్కొన్నప్పటికీ మంచి ఫలితాన్నే దక్కించుకుంది. మరి ‘థ్యాంక్ యు’ కూడా చైతూకు మరో మరపురాని సినిమా అవుతుందేమో చూడాలి.
This post was last modified on August 31, 2021 7:16 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…